Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా మహేష్ బాబు సినిమా అంటేనే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
Video Advertisement
అయితే ఏ హీరో అయినా సినిమాలో నటించే ముందు స్టోరీని చూసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత స్టోరీ నచ్చితే ప్రొసీడ్ అవుతారు హీరోలు. మహేష్ బాబు కూడా తన సినిమాలని సెలెక్ట్ చేసుకునే క్రమంలో కొన్ని సినిమాలని మిస్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలని ఎంచుకునేటప్పుడు ఇడియట్, గజినీ, 24 , సికందర్,స్నేహితుడు ఇలాంటి సినిమాలని మిస్ చేసుకున్నాడు. అయితే ఆ లిస్ట్ పెద్దదే వుంది. మరి ఆ చిత్రాలేమిటో ఇప్పుడు చూసేద్దాం.
#1 హరేరామ హరేకృష్ణ:
మహేష్ హీరోగా హరేరామ హరేకృష్ణ సినిమా రావాల్సింది. మహేష్, త్రివిక్రమ్, యం.ఎస్.రాజు రావాల్సింది. అనౌన్స్ కూడా చేసేసారు. కానీ సెట్స్ మీదకి రాలేదిది.
#2 శివమ్:
మొదట మహేష్ సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో దీనిని తీసుకొద్దాం అనుకున్నారు. క్రిష్ మహేష్ బాబు కాంబినేషన్లో అనౌన్స్ చేసిన చిత్రమిది. కానీ అవ్వలేదు.
#3 మణిరత్నంతో ఓ సినిమా:
అప్పట్లో మణిరత్నం, విక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ అది కూడా సెట్స్ మీదకి రాలేదు.
#4 మిర్చి:
‘దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై జస్తీ హేమాంబర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
#5 మిస్టర్ పర్ఫెక్ట్ :
ఇది కూడా అనుకున్నారు కానీ కుదరలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇది రావాల్సింది. ‘ఆర్.ఆర్.మూవీ మేకర్స్’ దీనిని అనౌన్స్ చేశారు.
#6 స్నేహితుడు :
‘3 ఇడియట్స్’ రీమేక్ ని తెలుగులో చేయగా.. విజయ్ హీరో పాత్రలో నటించాడు. అయితే మొదట మహేష్ బాబు హీరోగా చేస్తాడని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆఖరిని విజయ్ కి అవకాశం వచ్చింది.
#7 అతడే:
వి.వి వినాయక్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడే సినిమా రావాల్సింది. కానీ ఈ చిత్రం కూడా రాలేదు.
#8 జన గణ మన :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఈ సినిమా వస్తుందన్నారు. కానీ ఈ చిత్రం కూడా రాలేదు.
#9 బోయపాటి శ్రీనుతో ఓ సినిమా:
బోయపాటి శ్రీనుతో మహేష్ సినిమా ఒకటి వస్తుందని చెప్పినప్పటికీ ఆ సినిమా ఏమి రాలేదు.
#10 మెహర్ రమేష్ తో ఓ సినిమా:
మెహర్ రమేష్, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందన్నారు. పైగా గెస్ట్ రోల్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు. కానీ మళ్ళీ ఆ టాపిక్ ఏ లేదు. అదే విధంగా ఓ సోషియో ఫాంటసీ, ఓ మెడికల్ మాఫియా మూవీ, ‘వీరుడు’ ‘సైన్యం’ సినిమాలు కూడా ప్రకటనతోనే ఆగిపోయాయి.
End of Article