Ads
కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన షాజవాస్ వయసు 47 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. ఆయన కలప వ్యాపారం చేసేవారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఇంటికే పరిమితమైనా తన వ్యాపారాన్ని మాత్రం వదలలేదు.
Video Advertisement
పూర్తిగా బెడ్ కే పరిమితమైపోయినా, ఎడమ చెవికి ఎయిర్ పాడ్ ను తగిలించుకుని మరీ తన వ్యాపారాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. తనకు చెందిన టింబర్ డిపోలలో సిసి టివిలను ఏర్పాటు చేసుకుని వాటిని పర్యవేక్షిస్తూ… పనులు పూర్తి చేయిస్తున్నారు.
కాసరగోడ్ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలోని కంబలోర్ ఆయన స్వస్థలం. కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని మంచం పైనే ఉండి నిర్వహిస్తున్నారు. ధృడ సంకల్పంతో ఉన్న షాజవాస్ తనకు రోడ్డు ప్రమాదం జరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. 2010, మే 6వ తేదీన ఉదయాన్నే కలప కొనుక్కురావడం కోసం కరకాలకు బయలుదేరిన షాజవాస్ సాయంత్రానికి తిరిగి ఇంటికి రావడానికి బయలుదేరాడు.
షాజవాస్ తన స్నేహితుడితో పాటు కార్ లో వస్తుండగా.. 2 లారీల కలప వెనకే వస్తోంది. కేరళ సరిహద్దు దాటుతూ పెరియతడుకమ్ కు చేరుకునే సరికి బాగా చీకటిపడిపోయింది. డ్రైవర్ నిద్ర మత్తులోనే కారు తోలుతున్నాడు. వాహనం కిందకి వెళ్ళిపోతోందని గమనించిన షాజవాస్ డ్రైవర్ ని హెచ్చరించాడు. దీనితో.. ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేసరికి కార్ పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదం లో షాజవాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను కార్ నుంచి బయటపడ్డాడు.. కానీ తల ఓ బండరాయికి కొట్టుకోవడంతో స్పృహ తప్పాడు. ఆ సమయంలో అక్కడ సాయం చేయడానికి కూడా ఎవరు లేరు. వెనకాల లారీలో వస్తున్న వారు అతనిని ఆ ట్రక్ లోనే కన్హంగాడ్ ఆసుపత్రికి తరలించారు. తలకు బాగా దెబ్బలు తగిలాయి.. రక్తం కూడా విపరీతంగా పోయింది.
వారు మంగళూరులోని యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇది చాల రిస్క్ తో కూడిన వ్యవహారం అని వైద్యులు అన్నారు. దీనితో నాలుగు నెలల పాటు షాజవాస్ మంచానికే పరిమితం అయ్యారు. ఆ తరువాత అక్కడనుంచి వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. వారు 13 గంటల పాటు సర్జరీ చేసారు. మరో 5 నెలలు మంచానికే పరిమితం అయి ఉన్నారు. మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడం వలన మెడని మాత్రం కొంతవరకు కదిలించడానికి వీలు అవుతోందని షాజవాస్ తెలిపారు.
షాజవాస్ కు మెదడు పనితీరు సక్రమంగానే ఉంది. మాట్లాడగలుగుతున్నారు. అంతకుమించి శరీరం లో ఇతర అవయవాలు సహకరించవు. అయినాసరే భార్య సహాయంతో 9 నెలల తరువాత తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించారు. వైద్యానికి ఎక్కువ ఖర్చు అవడంతో.. షాజవాస్ భార్య నగలు అమ్మి డబ్బు సమకూర్చింది. అలా వ్యాపారం గాడిలో పడింది. ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఆయన కూతుళ్లు కూడా ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు.. వ్యాపారంలోను సాయం చేస్తున్నారు. ఈ వ్యాపారంలో కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం చాలానే ఉందని.. ప్రతి ఒక్కరు కష్టకాలం లో సాయం చేసుకుంటే అన్ని సమస్యల నుంచి గట్టెక్కచ్చని షాజవాస్ చెబుతున్నారు.
End of Article