Ads
ఇటీవల కొందరు మహిళలు కూడా వివాహేతర సంబంధాలకు మొగ్గు చూపుతున్నారు. భర్తల ఆరళ్ళను ఎదుర్కుంటున్న మహిళలు కొందరైతే.. భర్తలను మోసం చేస్తూ మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్న వారు మరికొందరు. తాజాగా.. ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.
Video Advertisement
పెళ్ళై, పిల్లలు ఉన్న ఒక మహిళ తన భర్తని కాదనుకుని హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం పెట్టుకుంది. ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా చేదు అనుభవాలని మిగులుస్తాయి.
భర్త కూలి పని చేస్తున్నాడని చిన్నతనంగా ఫీల్ అయిన మహిళ హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం పెట్టుకుంది. చివరికి ఆ కథ కూడా బెడిసి కొట్టడంతో ప్రాణాలు తీసుకుంది. తన భార్య మరణానికి హెడ్ కానిస్టేబుల్ కారణమని ఆ భర్త పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే కర్ణాటకకు చెందిన రాజేశ్వరి, వెంకటేష్ భార్యా భర్తలు. కొన్నేళ్ల పాటు వీరి జీవితం సజావుగానే సాగింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే రాజేశ్వరి భర్త కూలి పని చేస్తూ ఉంటారు. దీనితో ఆమె కొంత నామోషీగా ఫీల్ అయింది. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనంతకుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఈ పని చేయవద్దని వారించాడు.
అయినా ఆమె వినిపించుకోకుండా ఆ సంబంధాన్ని కొనసాగించింది. అయితే.. అనంత కుమార్ తో కూడా మనస్పర్థలు రావడంతో ఆమె మనస్థాపానికి గురి అయ్యింది. ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనితో ఆమె ఆత్మహత్యకి అనంత కుమార్ కారణం అంటూ.. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం అనంత్ కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం దర్యాప్తు చేస్తున్నారు.
End of Article