Home Human angle అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న ఈ క్యాబ్ డ్రైవర్ గుర్తున్నాడా..? ఇప్పుడు రాజకీయాల్లోకి..?

అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న ఈ క్యాబ్ డ్రైవర్ గుర్తున్నాడా..? ఇప్పుడు రాజకీయాల్లోకి..?

by Megha Varna

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో మనకి తెలియదు. పైగా అది మన చేతుల్లో కూడా లేదు. ఒకసారి ఒకలా ఉంటే మరొకసారి మరోలా ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా రుజువు చేసే ఒక ఘటన గురించి ఈరోజు మనం చూద్దాం. ఈ సంవత్సరం జూలై 30 న లక్నోలోని కృష్ణా నగర్ దగ్గర క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ, ప్రియదర్శిని అనే ఒక అమ్మాయికి మధ్య జరిగిన సంఘటన గురించి గుర్తు చేయక్కర్లేదు.

అందరికీ ఇది తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తప్పు లేకపోయినా ప్రియదర్శని అతనిని తన చెప్పుతో 22 చెంపదెబ్బలు కొట్టింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఇది సంచలనాన్ని సృష్టించింది. క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ ఓర్పుకి నిజంగా దేశమంతా కూడా సపోర్ట్ చేసింది.

Who is Saadat Ali? The Lucknow Cab Driver In News For Assault

అయితే అప్పుడు ఇలా అమ్మాయి చేతిలో చెంపదెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ ఏకంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ లోహియా లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు ఆ క్యాబ్ డ్రైవర్. సమాజంలో ఉండే మగవాళ్ళకి కూడా న్యాయం చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నానని అతను ప్రకటించాడు. మరి ఎన్నికల్లో విజయం సాధిస్తాడ లేదా అనేది చూడాలి.

You may also like