Ads
ఇటీవల మహిళలపై అనేక అఘాయిత్యాలు జరగడం చూస్తూనే ఉన్నాం. తెలిసిన వారినే అయిన నమ్మకుండా ఉండడమే ఉత్తమం. ఎవరు ఎటువైపునుంచి మోసం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా.. ఇటువంటి ఘటనే రాజస్థాన్లోని కోట ప్రాంతంలో చోటు చేసుకుంది.
Video Advertisement
మార్కెట్ నుంచి వస్తున్న తల్లి, కూతుళ్ళకు లిఫ్ట్ ఇస్తాను అంటూ ఓ వ్యక్తి అడిగాడు. అతను తెలిసిన వ్యక్తే అవడంతో వారు ఒప్పుకున్నారు. మొదట బైక్ ఎక్కించుకుని కొంతదూరం వెళ్ళాక.. ముగ్గురం వెళ్లడం కష్టమని..మొదట తల్లిని దింపేసి వస్తానని చెప్పాడు.
చెప్పినట్లే.. కూతురుని అక్కడే ఉంచేసి తల్లిని బండిపై ఎక్కించుకుని ఇంటివరకు వెళ్లి దింపేసి వచ్చాడు. ఆ తరువాత ఆ కూతురుని కూడా ఎక్కించుకుని ఇంటివైపుకు కాకుండా.. ఊరి చివరకు తీసుకెళ్లాడు. చీకటి పడుతున్నా.. కూతురు ఇంటికి రాకపోవడంతో మరో వైపు ఆ తల్లి కంగారుపడుతూ ఉండసాగింది.
మరుసటిరోజు ఉదయమే ఓ కాలవ పైప్ దగ్గర కూతురు మృతదేహం కనిపించింది. ఆమె పేరు మన్మార్ బాయి. మూడేళ్ల క్రితం యోగేంద్ర అనే వ్యక్తి తో ఆమె వివాహం జరిగింది. అయితే అతనితో పడకపోవడంతో.. మన్మార్ బాయి పుట్టింట్లోనే ఉంటోంది. భర్త ఎన్నిసార్లు పిలిచినా ఆమె వెళ్ళలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఆమె శవమై తేలడంతో.. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. వారికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
End of Article