Ads
సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్.
Video Advertisement
అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా అద్భుతమైన నటనతో పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ.. కృష్ణ కురుక్షేత్రం ఇలా రెండు చిత్రాలని ఇంచుమించు ఒకే కథాంశంతో తీశారు. ఆర్టిస్టులు కూడా రెండు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చింది. కానీ కైకాల సత్యనారాయణ మాత్రం రెండు చిత్రాల్లో నటించారు.
అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీఆర్ చేద్దాం అని అనుకునే లోగా కృష్ణ తీసి ఎన్టీఆర్ కి కోపం తెప్పించారు. ఈ విషయం వల్ల వీళ్లిద్దరి మధ్య పదేళ్ళపాటు మాటలు కూడా లేవు. దాన వీర శూరకర్ణ ఘన విజయం సాధించినప్పటికీ కురుక్షేత్రం మాత్రం విఫలం అయింది. కానీ గట్టిపోటీని మాత్రం ఈ సినిమా ఇచ్చింది.
అయితే రెండు సినిమాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. కానీ కురుక్షేత్రంలో నటించవద్దని ఎన్టీఆర్ సత్యనారాయణకి చెప్పారట కానీ అప్పటికే కురుక్షేత్రంలో మొదట ఆయనని బుక్ చేసుకున్నారు అందుకని తప్పక ఈ రెండు సినిమాల్లో నటించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం కృష్ణ సినిమాలో నటిస్తే నా సినిమాలో నటించ వద్దని కైకాల సత్యనారాయణకి కండీషన్ పెట్టారు.
End of Article