Ads
తెలుగు చిత్రపరిశ్రమలో అందాల తారలు శ్రీదేవి, జయప్రద అద్భుతంగా నటించి గుర్తింపు పొందారు. నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సాధారణంగా సినిమాలో పాత్రలకి నిజ జీవితానికి ఎటువంటి సంబంధం ఉండదు.
Video Advertisement
సినిమాలలో సాత్వికంగా నటించే నటులు నిజ జీవితంలో ఎక్కువ కోపంతో ఉండొచ్చు. అదేవిధంగా కాస్త రౌద్రంగా నటించే వాళ్ళు బయట చెడ్డవాళ్ళు అవ్వకపోవచ్చు. అందుకని ఎప్పుడూ పాత్రను బట్టి వాళ్ళ జీవితంలో ఎలా ఉంటారు అనేది అంచనా వేయకూడదు.
ఇది ఇలా ఉంటే అప్పట్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి ఇలా ఎంతో మంది తారలు అద్భుతంగా నటించారు. జయప్రద, శ్రీదేవి తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా కలిసి నటించారు. అయితే కొన్ని సినిమాల్లో అక్క చెల్లెలుగా కూడా వీళ్ళు పాత్రలు చేసినప్పటికీ తెర బయట మాత్రం వీళ్ళు బద్దశత్రువులు.
దీనికి గల కారణం ఏమిటంటే ఈ హీరోయిన్లకు ఉండే క్రేజ్ వల్లే. ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడిన రోజులే లేవు. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా పాత్రలు చేసే వారు. ఒక సారి కట్ అని చెప్పాక వీళ్ళు ఎడమొహం పెడమొహం పెట్టుకుని కూర్చునేవారట.
End of Article