Home Filmy Adda Bheemla Nayak: “భీమ్లా నాయక్” కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bheemla Nayak: “భీమ్లా నాయక్” కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Anudeep

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలంటే చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాలి.

డైరెక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా విషయమై త్రివిక్రమ్ కు కొన్ని బాధ్యతలు అప్పగించారు.

bheemla nayak

మలయాళ క్లాసికల్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కానీ, ఇందులో పవన్ మేనరిజం కి తగ్గట్లు చాలానే మార్పులు చేస్తున్నారట. ఈ సినిమాకోసం త్రివిక్రమ్ కు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను ఇస్తున్నారట. ఇది కాక.. లాభాల్లో కూడా కొంత పర్సెంటేజ్ ను ఇస్తున్నారట. సాధారణంగా త్రివిక్రమ్ డైరెక్టర్ గా చేసే సినిమాలకంటే ఎక్కువ మొత్తంలోనే ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని ఫిలిం వర్గాల్లో టాక్.

You may also like