Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
Video Advertisement
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇటీవల చైతు బర్త్డే సందర్భంగా సమంత కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. తరువాత రోజు తన పెట్ డాగ్ పుట్టినరోజు సందర్భంగా సమంత పోస్ట్ చేయడంతో చై అభిమానులు కొంచంగట్టిగానే ఫీల్ అయ్యారు. ఇది ఇలా ఉంటె.. నెట్‌ఫ్లిక్స్ లో జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జోనస్ ఫ్యామిలీ పాల్గొంది. ఈ వీడియో ను ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ను సమంత కూడా షేర్ చేసారు. గత కొన్ని రోజుల క్రితమే ప్రియాంక కూడా సమంత లానే ఇన్స్టా లో భర్త పేరు తొలగించడంతో.. వీరు విడిపోతున్నారు అన్న వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో సమంత , ప్రియాంక వీడియో ను షేర్ చేయడం వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
End of Article