Ads
బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Video Advertisement
“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి ఎలిమినేట్ అవ్వడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, రవిని ఉన్నట్లుండి ఎలిమినేట్ చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు రవికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అన్న చర్చ కూడా జరుగుతోంది. వారానికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు మాట్లాడుకున్నారట. ఈ లెక్కన ఇప్పటివరకు రవికి 90 లక్షల వరకు ఇస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా.. రవి ఫైనల్స్ వరకు వెళ్తారని అందరు అనుకున్నారు.
End of Article