Ads
బిగ్ బాస్ రియాలిటీ షో తొందరలోనే ముగియబోతోంది. ఈ షో లో విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం ప్రైజ్ మనీ ని మాత్రమే ఇచ్చేవారు.
Video Advertisement
ప్రస్తుతం.. ప్రైజ్ మనీతో పాటు ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలాన్ని కూడా ఇస్తున్నారు. ఈ విషయమై హోస్ట్ నాగార్జున కూడా హౌస్ లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకుంటే.. ఎవరెవరు ఏమేమి చేస్తారో చెప్పాలని నాగ్ అడగగా.. మొదట ప్రియాంక సింగ్ మాట్లాడింది. తాను 50 లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే.. తన తల్లితండ్రుల కోసం ఇల్లు కడతానని పేర్కొంది. అలాగే.. తనకు అమ్మ అని పిలిపించుకోవాలని ఉందని, ఎవరినైనా దత్తత తీసుకోవాలంటే బ్యాంకు బాలన్స్ కూడా ఉండాలి కాబట్టి.. నేను ప్రైజ్ మనీ గెలిస్తే ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటానని పేర్కొంది.
End of Article