Ads
ప్రతి సమస్యకి చావే పరిష్కారమని భావిస్తూ.. నేటి కాలం లో యువత ఆవేశం లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తప్పుడు నిర్ణయానికి మరో బాలిక బలి అయింది. ఆ బాలిక వయసు ఎంతో లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ అమ్మాయి తెలిసి తెలియనితనంలో చేసిన తప్పుకి ప్రాణాలు తీసుకుంది.
Video Advertisement
వయసు వ్యామోహంలో ఓ కుర్రాడి ప్రేమలో పడింది. రెండేళ్ల పాటు తనను తాను అర్పించుకుని శారీరక సుఖాన్ని కూడా ఇచ్చింది. చివరకు అతను పెళ్లి చేసుకోను అంటూ మొహం చాటేయడంతో ఆత్మహత్య కు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది. మాణిక్యారం గ్రామ శివారులో రూప్ తండాకు చెందిన తారాచంద్ అనే కుర్రాడిని ప్రేమించింది. అతని వలలో పడి శారీరకంగా కూడా దగ్గరైంది. తమ కూతురు ఎవరినో ప్రేమిస్తోందని తెలుసుకున్న తల్లి తండ్రులు ఆమెని నిలదీశారు.
నా వాడొస్తాడని.. అతడినే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లితండ్రులతో గొడవ పడింది. ఈ విషయమై తారాచంద్ ను అడగగా.. అతను నేను పెళ్లి చేసుకోను అంటూ తప్పుకున్నాడు. దీనితో ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యి నాలుగు రోజుల క్రితమే ఎలుకల మందుని తాగేసింది. దాదాపు మూడు రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంది. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. అభం శుభం తెలియని అమ్మాయిని మోసం చేసినందుకు తారాచంద్ ని శిక్షించాలని గ్రామస్తులు పోలీసులని డిమాండ్ చేస్తున్నారు.
End of Article