Ads
బస్సులో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన చిన్నతనంలో మన తల్లితండ్రులతో కలిసి ప్రయాణించే సమయాల్లో కూడా మనల్ని చేతులు బయటకు పెట్టనివ్వకుండా జాగ్రత్తలు చెప్పేవారు కదా.. అవి మనం నిత్యం పాటించాలి. లేదంటే ఇటువంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి.
Video Advertisement
ఇటీవల రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఓ 18 సంవత్సరాల అమ్మాయి కాలేజీ చదువుని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆ అమ్మాయి బస్సు ఎక్కాక కిటికీ పక్కన కూర్చుంది. అయితే.. తన స్నేహితురాలితో మాట్లాడుతూ చెయ్యిని బయటకు పెట్టింది. అదే సమయంలో వెనుక నుంచి ట్రాక్టర్ వచ్చింది. ఆమె చెయ్యి ట్రాక్టర్ కి తగిలి తెగి పడిపోయింది. ఈ దుర్ఘటనతో అందరు షాక్ అయ్యారు. ఆ అమ్మాయి షాక్ నుంచి తేరుకుని.. బస్ దిగిపోయి.. ఆ తెగిన చెయ్యిని బాగ్ లో వేసుకుని అలాగే 8 కి.మీ దూరం వెళ్ళింది.
8 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు ఆమెని ఆ పరిస్థితిలో చూసి అవాక్కయ్యారు. ప్రధమ చికిత్స మాత్రం చేసి.. చేతులెత్తేశారు. ఆ చెయ్యిని అతికించలేమని.. వీలైనంత తొందరగా మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీనితో ఆ అమ్మాయి జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. ఈ లోపు విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
End of Article