Home Filmy Adda Sirivennela: సిరివెన్నెల కోసం మెగాస్టార్ 2 రోజులు ఎందుకు వెతికారో తెలుసా..?

Sirivennela: సిరివెన్నెల కోసం మెగాస్టార్ 2 రోజులు ఎందుకు వెతికారో తెలుసా..?

by Anudeep

ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

సినీ సాహిత్య ప్రపంచానికి ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు అందరు సన్నిహితులే.. అందరితోనూ స్నేహంగా మెలిగేవారు.

megastar sirivennela

అయితే.. మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెల గారికోసం దాదాపు రెండు రోజులపాటు వెతికారట. సిరివెన్నెల రాసిన రెండవ పాట మెగాస్టార్ “వేట” సినిమాలోదిట. ఆ సినిమాలో దర్శకుడు కోదండరామిరెడ్డి చెప్పిన దానిప్రకారం ఒక పాటను ఇరవై రకాలుగా రాశారట. అది చూసిన సంగీత దర్సకుడు చక్రి.. పాటలు బాగా రాస్తున్నారని ఓ ట్యూన్ చెప్పగలరా అని కోరడంతో.. సిరివెన్నెల ట్యూన్ ని కూడా చెప్పారట. ఆయన రాసిన పాటలను విన్న చిరంజీవి.. అవి బాగా నచ్చడంతో సిరివెన్నెలను డైరెక్ట్ గా కలిసి అభినందించాలి అనుకున్నారట. అందుకోసం రెండురోజుల పాటు సిరివెన్నెల గారికోసం వెతికారట.

You may also like