Ads
హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సినిమాతో 8 మంది హీరోహీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అలాగే ఇంకా కొంత మంది ముఖ్యపాత్రల్లో నటించిన నటులు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Video Advertisement
గత బిగ్ బాస్ విజేత అయిన అభిజిత్ ఇందులో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించారు. అలాగే సుధాకర్ కొమాకుల కూడా మరొక హీరో అయిన నాగరాజుగా నటించారు. ఈ సినిమాకి ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా థియేటర్లలో విడుదలైనప్పుడు అంత మంచి స్పందన రాలేదు. మిక్స్డ్ టాక్ తో సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే, అభిజిత్ పాత్ర పోషించిన శ్రీను, తన చెల్లెళ్ళతో కలిసి హైదరాబాద్ కి వచ్చి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంటాడు. ఒక సారి వీళ్ళు గోల్డ్ ఫేస్ కాలనీ వాళ్ళతో మ్యాచ్ ఆడుతారు. అందులో శ్రీను కూడా ఆడతాడు. మొదట్లో శ్రీను డిఫెన్స్ ఆడతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు “ఎవడే వీడు? ఇలా ఆడుతున్నాడు ఏంటి?” అప్పుడు పద్దు పాత్ర పోషించిన హీరోయిన్ కూడా అలాగే, “ఏంటి ఇలా ఆడుతున్నాడు?” అని అంటుంది.
తర్వాత హీరో బాగా ఆడడం మొదలు పెడతాడు. తర్వాత టీం గెలుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు, “బాగా ఆడాడు. ఎవరు ఇతను?” అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వచ్చి, “మా బావ” అని చెప్తుంది. అదేంటి? ముందు వాళ్ళు మాట్లాడుతుంటే ఏం అనలేదు, గెలిలిచిన తర్వాత మాత్రం అతను ఎవరో చెప్పింది? అని కామెంట్స్ చేస్తున్నారు.
watch video:
End of Article