Ads
పెళ్లి భోజనం అనగానే రకరకాల వంటలు, డీసెర్ట్ లు గుర్తొస్తాయి. అయితే.. అతిధుల కోసం చేసిన ఇన్ని స్పెషల్ ఐటమ్స్ ను ఒక్కోసారి పూర్తిగా వడ్డించలేము. ఎందుకంటే పరువు మర్యాదల కోసం కొంచం ఎక్కువగానే వంట చేయిస్తూ ఉంటాము.
Video Advertisement
కానీ.. అతిధుల సంఖ్య తగ్గినా.. వచ్చిన వారు సరిగ్గా తినకపోయినా చాలా పదార్ధాలు వృధా అవుతుంటాయి. ఇది ఒక లెక్క ఉండదు కాబట్టే పెళ్లిళ్లలో ఎక్కువగా ఆహార పదార్ధాలు మిగిలిపోతుండడం గమనిస్తూ ఉంటాం.
అయితే.. ఓ మహిళా తన సోదరుడి పెళ్ళిలో ఇలానే జరగడంతో.. అక్కడ పదార్ధాలను తీసుకొచ్చి రోడ్డుపై పడుకున్న వారికి వడ్డించింది. పెళ్లి భోజనాలు అవ్వగానే.. ఆమె అలానే పట్టు బట్టలతోనే వచ్చి రోడ్డుపై పడుకున్న వారందరిని లేపింది. ఈ ఘటన కలకత్తాలో చోటు చేసుకుంది. ఈ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
End of Article