Ads
ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది.
Video Advertisement
ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి.
ఒరిజినల్ తో పోలిస్తే భీమ్లా నాయక్ లో మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ లో లేని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయట. అలాగే.. నిత్య మీనన్, పవన్ ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందట. ఒరిజినల్ లో ఇవేమి లేవు. కానీ రీమేక్ లో మాత్రం ఈ మార్పులు చేస్తున్నారు. ఇక మూడవ మార్పు ఏమిటంటే.. కామెడీ ట్రాక్. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా నటిస్తున్నారట. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ ఉంటుందన్న సంగతి తెలిసిందేగా.
Also Read: Bheemla Nayak Song Lyrics in Telugu and English
End of Article