తల్లి కళ్ళల్లో ఆనందం కోసం ఆటోని నడుపుతూ.. ఈమె కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

తల్లి కళ్ళల్లో ఆనందం కోసం ఆటోని నడుపుతూ.. ఈమె కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

by Megha Varna

Ads

ఈ తరం యువత చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల చదువుకు ఆటంకం కలిగితే ఆ కష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా ఒక అమ్మాయికి చాలా కష్టాలు ఎదురయ్యాయి, కానీ ఆమె వాటన్నిటినీ ఎదుర్కొని చదువును కొనసాగిస్తోంది. మరి ఆమె కథ గురించి చూస్తే.. ఆ అమ్మాయి పేరు సబితా.

Video Advertisement

ఈమె నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో నివసిస్తోంది, చాలా నిరుపేద కుటుంబానికి చెందినది. సబితా తండ్రి హోటల్లో పని చేస్తూ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థికంగా వీరి కుటుంబం దెబ్బతింది. దాంతో తల్లి అదే హోటల్లో పని చేస్తూ సబితను పదవ తరగతి వరకు చదివించింది. ఆ తర్వాత బైపిసి గ్రూపు ఎంపిక చేసుకుని ప్రభుత్వ కళాశాలలో చేరింది.

వీళ్ల గ్రామం నుండి కాలేజీకి చేరాలంటే 21 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈమె చాలా యాక్టివ్ గా ఉండడంతో హోటల్ యజమాని ఉపాధి చూపించడానికి సబితా అంగీకారంతో ఆటో నేర్పించాడు. అయితే ఆమె సెకండ్ హ్యాండ్ ఆటోని తీసుకొని కాలేజీకి వెళ్లే ముందు మరియు కాలేజీ అయిపోయిన తర్వాత ఆటో నడుపుతోంది.

ఇలా చేయడం వల్ల తన ఖర్చులకు సొంతంగా సంపాదిస్తుంది మరియు వాళ్ళ అమ్మకు అండగా నిలిచింది. అంతే కాకుండా ఆత్మ రక్షణ ఉండాలని కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. ఈ విధంగా జీవించడానికి ఉపాధి ఏర్పాటు చేసుకుని ధైర్యంగా జీవిస్తోంది. నిజంగా ఇలాంటి ఆడపిల్లలు ఎందరికో ఆదర్శం.

watch video:


End of Article

You may also like