ఆ టైం లో ఆ మహిళ చేసిన పని ఆ యువకుడి ప్రాణాలు కాపాడింది.. ఈ వార్త గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

ఆ టైం లో ఆ మహిళ చేసిన పని ఆ యువకుడి ప్రాణాలు కాపాడింది.. ఈ వార్త గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

రోడ్డుపై వెళ్తున్నపుడు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంతో ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ప్రమాదం చోటు చేసుకున్న సందర్భాలలో చుట్టూ ఉన్న వారు బాధితుడిని రక్షించే ప్రయత్నం చేయాలి. తాజాగా.. రోడ్డుపై ఓ యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఓ మహిళ కాపాడిన ఘటన తమిళనాడు లో హెకోటు చేసుకుంది.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, తమిళనాడులో తిరువారూర్‌లోని మన్నార్‌గుడి ప్రాంతంలో గత శుక్రవారం (డిసెంబర్ 3) రోజున ఈ ప్రమాదం జరిగింది. ఓ పాలిటెక్నిక్ విద్యార్థి వసంత్‌ బైక్ నడుపుకుంటూ వస్తున్నాడు.

nurse

అదే సమయంలో మన్నార్ గుడి జిల్లా ప్రధాన కేంద్రంలో కాంట్రాక్టు నర్స్ గా పని చేస్తున్న వనజ అనే నర్స్ కూడా కార్ లో వెళ్తోంది. వారాంతపు సెలవుల సందర్భంగా ఆమె మదుకూరు సమీపంలోని తమ చుట్టాల ఇంటికి కార్ లో వెళ్తోంది. అయితే.. ఆమె కార్ కి ముందుగా విద్యార్థి వసంత్‌ బైక్ నడుపుతూ వెళ్తున్నాడు. ఉన్నట్లుండి మేక అడ్డుగా రావడంతో బైక్ అదుపు తప్పి వసంత్ కింద పడిపోయాడు.

nurse 1

ఉన్నట్లుండి ఆక్సిడెంట్ జరగడంతో అతని పల్స్ పడిపోయింది. అయితే వెనకాలే కార్ లో వస్తున్న వనజ వెంటనే బండి దిగి అతనికి సిపిఆర్ ( కార్డియో పల్మనరీ రిససియేషన్ ) చేసారు. ఒక ముప్పై సెకండ్ల పాటు ఆమె కార్డియో పల్మనరీ రిససియేషన్ చేయగా ఆ యువకుడు స్పృహ లోకి వచ్చాడు. మరో రెండు నిమిషాల పాటు ఆమె కార్డియో పల్మనరీ రిససియేషన్ ను కొనసాగించింది. ఆ యువకుడు తిరిగి లేచి నడిచే స్థాయికి చేరుకున్నాడు.

వెంటనే ఆ యువకుడిని అంబులెన్సు ద్వారా తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాంట్రాక్టు నర్స్ గా పని చేస్తున్న వనజ సకాలంలో ప్రాధమిక వైద్యం అందించడం వల్లనే ఆ యువకుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. కాగా.. వనజ కాపాడుతున్న టైం లో తీసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలనీ సూచిస్తున్నారు.


End of Article

You may also like