Ads
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఇటీవలే ఎలిమినేట్ అయిపోవడం కూడా మనం చూశాం. అయితే తాజాగా యాంకర్ రవి పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఎందుకు పోలీసుల వద్దకు వెళ్ళాడు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.
Video Advertisement
దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే… కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకోవాలని యాంకర్ రవి పోలీసుల్ని కోరాడు. తన పై మరియు తన కుటుంబ సభ్యుల పై కొందరు చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చాడు రవి.
కేవలం తన పైన మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేశారు అని యాంకర్ రవి చెప్పాడు. ఎప్పుడూ కూడా ఇలాంటి కామెంట్లని పట్టించుకోని రవి కుటుంబ సభ్యుల పై కామెంట్స్ చేయడం వలన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనని ఉద్దేశించి చేసిన ఒక బ్యాడ్ కామెంట్ కి ఆన్సర్ చెప్పాలని రవి అంటున్నాడు.
End of Article