Ads
ఈ మధ్య చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్ ను అలవాటు చేయడం ఎక్కువ అయిపోతోంది. మొబైల్ ఫోన్ ఇవ్వని పక్షంలో వారు మరింతగా మారం చేయడం కూడా పెరుగుతోంది. తాజాగా.. మొబైల్ ఫోన్ వాడొద్దని తల్లి తండ్రులు మందలించినందుకు మనీషా అనే స్కూల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Video Advertisement
ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మనీషా అనే అమ్మాయి బూడిగ నరేశ్, ఉమారాణి దంపతుల కుమార్తె. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ పాఠాల కోసం మనీషా ఫోన్ కి అలవాటు పడింది.
అయితే తిరిగి పాఠశాలలు మొదలయిన ఆమెకు ఫోన్ అలవాటు పోలేదు. ఇటీవల ఆమె తల్లితండ్రులు ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని, ఫోన్ వాడకాన్ని తగ్గించాలని హెచ్చరించడంతో ఇంట్లో ఉన్న కలుపు మందు తాగేసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఉన్నట్లుండి ఆమె వాంతులు చేసుకోవడంతో ఏమైంది అంటూ కుటుంబ సభ్యులు అడిగేసరికి అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగా పాప మరణించింది. తల్లి ఉమారాణి ఈ విషయమై ఫిర్యాదు చేయగా.. కారేపల్లి ఏఎస్ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article