Ads
తాజాగా కాజల్ ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీరామ్, మానస్, సన్నీ, షణ్ముఖ్ మరియు సిరి ఈ అయిదుగురు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా రాబోతోంది. దీనితో విన్నర్ ని డిక్లేర్ చేసేస్తారు. పైగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నట్లు తెలుస్తోంది.
Video Advertisement
పైగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంటే పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయి. అయితే ఈసారి అంతలా బిగ్ బాస్ మీద కి ఆసక్తి కలగక పోవడానికి కారణాలు ఈ ఐదే అని చెప్పచ్చు.
నాగార్జున మళ్లీ హోస్ట్ కింద ఉండడం అలానే కంటెస్టెంట్లు అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వలన ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు.
అలానే కామన్ మ్యాన్ అటెన్షన్ ని తీసుకోవడంలో కంటెస్టెంట్స్ ఫెయిల్ అయ్యారు.
అంతే కాకుండా గత సీజన్లో వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్లుకి కూడా అంతగా ఆఫర్లు రాలేదు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ కి కానీ విన్నర్స్ కి కానీ అంత గొప్ప అవకాశాలు రాలేదు. కలిసి రాలేదు.
కెరీర్ లో ఎలాంటి మార్పు రావకపోవడం కూడా బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ తగ్గిందని తెలుస్తోంది.
End of Article