Ads
వచ్చి పోయే బంధువులతో, పెళ్లి భోజనాలతో ఆ కల్యాణమండపం కళకళలాడుతోంది. మరో అరగంటలో వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. ఈలోపు భోజనం చేద్దామని వరుడు డైనింగ్ హాల్ వైపుకు వచ్చి తినడానికి కూర్చున్నాడు.
Video Advertisement
మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. భోజనానికి కూర్చున్న వరుడిని పట్టుకుని వధువు బంధువులు చితకబాదారు. మామూలుగా కాదు కింద పడేసి మరీ కొట్టారు. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఈ వరుడిని ఎందుకు ఇంతలా కొట్టాల్సి వచ్చింది..?
ఘజియాబాద్ జిల్లా షాహియా బాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికి అంతా సిద్ధం అయ్యింది. వధువు తరపు వారు వరుడికి కట్నం కూడా ఇచ్చుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతోందన్న సమయానికి ఈ ప్రబుద్ధుడు మరో మూడు లక్షల కట్నాన్ని, డైమండ్ రింగ్ ను అదనంగా ఇవ్వాలంటూ వధువు తండ్రిని అడిగాడు. పెళ్ళికి గంట ముందు అడిగినా.. వారు అప్పటికప్పుడు అడిగినవి తీసిచ్చారు.
కానీ.. తిరిగి కొంత సేపటిలోనే మా తండ్రి మరో 12 లక్షలు కట్నం అడుగుతున్నారని, కట్నం ఇవ్వకుంటే ఈ పెళ్లి జరగదు అని తెగేసి చెప్పాడు. అతనికి అర్ధం అయ్యేలా చెప్పాలని వధువు తరపు బంధువులు ఎంతగానో నచ్చ చెప్పి చూసారు. అయినా ఆ తండ్రి కొడుకులు వినిపించుకోలేదు.
ఈ లోపు.. ఆ వ్యక్తికీ ఇంతకుముందు రెండుసార్లు పెళ్లి అయ్యిందని ఆ విషయం దాచిపెట్టి నాటకం ఆడుతున్నాడని తెలిసింది. దీనితో వధువు తరపు వారికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. డైనింగ్ హాల్లోనే భోజనం చేస్తున్న వరుడిని లేపి మరీ పిచ్చ కొట్టుడు కొట్టేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇలా మోసాలు చేసి పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసారు.
Watch Video:
End of Article