Ads
పుట్టుక, చావు రెండూ మన చేతుల్లో ఉండవు. కేవలం బ్రతుకు మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఆ వున్న జీవితంలో అనుకున్నవి చేసేయాలి. పట్టుదలతో ముందుకు వెళ్లాలి. అంతేకానీ ఓటమి ఎదురైందని అందులోనే ఉండిపోవడం, బాధ పడిపోవడం సరైనది కాదు. అచ్చం ఇక్కడ చెప్పిన మాదిరి అనుసరిస్తోంది అంకితా షా అనే ఒక యువతి.
Video Advertisement
మరి ఆమె ఎలా పోరాడుతోంది..?, ఎలా ముందుకు వెళుతోంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సరిగ్గా రెండు కాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా జీవితంలో నిలబడడం కష్టమవుతుంది. కానీ అంకితా షా మాత్రం రెండు కాళ్ళ మీద నిలబడే అదృష్టం లేకపోయినా ఒంటరిగా పోరాటం చేస్తోంది.
ఇక ఈమె గురించి వివరాలలోకి వెళితే.. ఆమెది గుజరాత్. స్వగ్రామం పాలిటానా. ఈమె పుట్టిన ఏడాదికి పోలియో వచ్చింది. దాంతో కుడికాలు తీసేశారు. అప్పటి నుండి ఆమె ఒంటి కాలు మీదే నిలబడుతోంది. ఎకనామిక్స్ లో డిగ్రీ చదివినప్పటికీ అంగవైకల్యం కారణంగా ఈమెకి ఉద్యోగం దొరకలేదు. అలా అని ఆమె ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. ఆమె ఎలా గెలుపొందాలి అనే దానిలోనే ఉండి బతుకు తెరువు కోసం ఆమె చాలా పనులు చేస్తోంది.
హోటల్ లో హౌస్ కీపింగ్ గా కూడా ఈమె పని చేసేది. కొంత కాలం క్రితం తన తండ్రికి అనారోగ్యం వచ్చింది. దానితో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఈమెకి సెలవు ఇవ్వరని అందుకోసమే డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టింది.
ఈమెకి ఒక్క కాలు మాత్రమే ఉండటంతో ఆటోని చేతులతో ఆపరేట్ చేస్తోంది. తండ్రిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చూపించిన తర్వాత ఆటో నడుపుతోంది. ప్రతీ రోజు 10 గంటల పాటు ఈమె కష్టపడుతోంది. క్యాబ్ సర్వీస్ ని కూడా ఈమె అందిస్తోంది. ఇప్పుడు చాంద్ ఖేడా నుంచి కాలుపూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆటో నడుపుతోంది. ఇలా తన కుటుంబం కోసం ఆమె అహర్నిశలు శ్రమిస్తోంది.
End of Article