వైరల్ అవుతున్న ఈ ఫోటోల వెనకున్న “కథ” ఏంటో తెలుసా.?

వైరల్ అవుతున్న ఈ ఫోటోల వెనకున్న “కథ” ఏంటో తెలుసా.?

by Megha Varna

Ads

యునిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2021 గా నిలిచింది ఒక అద్భుతమైన చిత్రం. ఈ చిత్రం ప్రపంచంలో చిన్నారులు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉంటున్నారు అనే దానిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా యూనిసెఫ్ అవార్డుల్ని అందిస్తుంది. ఈ సంవత్సరం కూడా అవార్డులు ప్రకటించింది. అయితే దీనిలో గొప్ప విషయం ఏమిటంటే వీటిలో రెండు బహుమతులు భారత ఫోటోగ్రాఫర్లకు దక్కాయి.

Video Advertisement

ఒక ఫోటోగ్రాఫర్ పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతంలో ఫోటోలు తీయడానికి వెళ్లారు. అక్కడ ప్రకృతి వైపరీత్యాలకు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడుతున్న జీవితాల్ని చూశారు. అందులో పల్లవి కుటుంబం కూడా ఒకటి. ఈ పన్నెండేళ్ళ పల్లవికి ఫోటో తీశారు.

ఈ 12 ఏళ్ల అమ్మాయి సొంతంగా టీ కొట్టు నడుపుతోంది. ట్రక్కు నడుపుతున్న తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటోంది. వరదల కారణంగా పల్లవి ఉంటున్న ఇల్లు, టీ కొట్టు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇలాంటి స్థితిలో పల్లవి కనిపించడంతో ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. యునిసెఫ్ అవార్డులకు పంపించగా తొలి బహుమతి ఈ ఫోటోకి లభించింది.

ఇదిలా ఉంటే రెండో బహుమతి కూడా భారత ఫోటోగ్రాఫర్ కి దక్కింది. మహారాష్ట్రకు చెందిన సౌరవ్ దాస్ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు సంబంధించిన చిత్రాన్ని తీసి పంపించారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది చదువుకోలేక పోయారు. ముఖ్యంగా పేద పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్ లేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అయితే దీప్ నారాయణ అనే ఒక ఉపాధ్యాయుడికి అద్భుతమైన ఆలోచన కలిగింది.

మహారాష్ట్రలో మారుమూల గ్రామంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి వీలులేక పోవడంతో తన ఇంటి గోడలను బ్లాక్ బోర్డ్ లాగ మార్చారు. దూరం దూరంగా కూర్చోబెట్టి బోధించారు. అలానే కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలని కూడా వాళ్లకి చెప్పారు. ఈ దృశ్యాన్ని సౌరవ్ దాస్ ఫోటో తీయగా రెండవ బహుమతి వచ్చింది.


End of Article

You may also like