Ads
సంక్రాంతి అంటే సాధారణంగా పెద్ద సినిమాలకి పండుగ. సంక్రాంతి రాంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతాయి. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ. దాంతో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతాయి అని ముందే ప్రకటించారు.
Video Advertisement
అందులో రాధే శ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ విడుదల కారణంగా ఈ సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని సినిమాలు విడుదల తేదీలు మార్చుకున్నాయి.
ఈ విషయంలో అల్లు అర్జున్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే 2020 లో అల వైకుంఠపురంలో సినిమాని లాక్ డౌన్ ముందు విడుదల చేసారు. సినిమా హిట్ టాక్ వచ్చి మంచి లాభాలు వచ్చాక లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అంతే అయ్యింది. 2022 సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ వెనకడుగు వేసాయి. పుష్ప మాత్రం డిసెంబర్లో విడుదల అయ్యి మిక్స్డ్ టాక్‌తో కూడా దూసుకుపోతోంది. పుష్ప విడుదల సమయంలో చాలా మంది, “అసలు అల్లు అర్జున్ ఎందుకు అంత తొందర పడుతున్నారు. కొంచెం ఆగి రిలీజ్ చేయాల్సింది” అని అన్నారు.
అందుకు కారణం పుష్ప బృందం సినిమా విడుదల అయ్యేంత వరకు చిన్న చిన్న విషయాలపై పని చేస్తునే ఉన్నారు. ఈ పనుల వల్ల దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా రాలేదు. సినిమా టాక్ మొదట్లో నెగెటివ్‌గా రావడానికి ఒక రకంగా ఈ చివరి నిమిషంలో మార్పులు కూడా కరణమయ్యాయి. దాంతో, “సినిమా బృందం హడావిడి పడుతున్నారు. ఈ పనులు కొంచెం మెల్లగా చేసుకోని 2022 లో సినిమాని విడుదల చేయాల్సింది” అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం “అదృష్టమంటే అల్లు అర్జున్ దే. ఎందుకంటే రెండు సార్లు ఈ కరోనా వల్ల విడుదల వాయిదా వేయటం అనే నిర్ణయం నుండి తప్పించుకున్నారు” అని అంటున్నారు నెటిజన్లు.
End of Article