Ads
ఈ మధ్యకాలంలో చదివే చదువుకి చేసే ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం ఉండడం లేదు. తక్కువ చదువుకుని ఎక్కువ సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. అదే దారిలో వెళ్తున్నాడు ఈ తెనాలి కుర్రోడు కూడా. చదివింది చూస్తే ఎనిమిదవ తరగతి. సంపాదన చూస్తే నెలకు మూడు లక్షల పైనే. మరి ఇక అసలు ఈ తెనాలి కుర్రోడు ఏం చేస్తున్నాడు..?, అసలు ఎలా సంపాదిస్తున్నాడు అనే వాటి గురించి చూద్దాం.
Video Advertisement
ఎనిమిదవ తరగతి చదువు ఆపేశాడు. ఆ తర్వాత ఫ్యాన్సీ కొట్టు లో పని చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు రోజుకి ఇరవై రూపాయలు ఇచ్చేవారు. అయితే నెలకు రూ.30 వేలు వస్తాయని దక్షిణాఫ్రికా కి వెళ్ళాడు. అయితే వాటిలో ఇరవై వేలు ఇంటి అద్దెకు అయిపోయేవి. దీంతో ఓ పూట తినీ, ఓ పూట తినక రోజులు గడిపేవాడు. చేతిలో రూపాయి లేకపోయినా సరే 20 దేశాలని చూసి వచ్చాడు. తను వెళ్ళిన ప్రతి చోటా కూడా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. వాటినన్నిటినీ ‘ఉమా తెలుగు ట్రావెలర్’ పేరుతో యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు.
ఆ వీడియోలు కి ఫిదా అయిపోయి ఏడు లక్షల ఫాలోవర్లు తను ఛానల్ కి చేరారు. ఈ ఛానల్ ద్వారా నెలకు మూడు లక్షలు పైగా సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉమా ప్రసాద్ కి 33 ఏళ్ళు. కృష్ణా జిల్లా మూలపాలెంలో జన్మించాడు. అయితే అతను పుట్టిన రెండేళ్లకి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో 8వ తరగతి చదివిన తర్వాత చదువు ఆపేసాడు. ఆ తరవాత వివిధ రకాల పనులు చేయడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ ఎక్కువ డబ్బులు రాలేదు.
ఎక్కువగా ఖాళీ సమయాల్లో యూట్యూబ్ లో ట్రావెల్ వీడియోలు చూస్తూ ఉండేవాడు. ప్రపంచ దేశాలన్నీ చూసి రావాలని అతని కల. అయితే చదువు ఆపేసి ఏవేవో పనులు చేసుకుంటుండగా బంధువుల్లో ఒకరు దక్షిణాఫ్రికాలోని మాలి లో ఉద్యోగం ఉందని ముప్పై వేలు వస్తాయని చెప్పడంతో 2019లో మాలి చేరుకున్నాడు. అక్కడ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ ప్రపంచయాత్ర చేయడానికి ఆలోచించేవాడు.
2020 మార్చి 22న ఇంటికి తిరిగి వచ్చేయాలనుకున్నాడు. కానీ ఇండియాలో లాక్ డౌన్ మొదలైంది. ఇంకేం చేయాలో తోచక మాలి లోనే ఉండిపోయాడు. ఉమా తెలుగు ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ లో వ్లాగ్ క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. వరుసగా 14 వీడియోలు అప్లోడ్ చేయగా.. 800 మంది ఫాలోవర్స్ వచ్చారు.
జూన్ ఒకటి నుంచి కూడా విపరీతంగా ఫాలోవర్లు పెరిగారు. ఏడాదిన్నర వ్యవధిలో దక్షిణాఫ్రికా, మధ్య ఆసియాలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా, రష్యా సహా 20 దేశాలను చూసి.. ఆ వీడియోని అప్లోడ్ చేసి నెలకి మూడు లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రపంచంలోని 197 దేశాలు చుట్టి వచ్చి అక్కడ విషయాలని తెలుగు ప్రజలకు అందించాలని అనుకుంటున్నాడట.
End of Article