Ads
మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చిరంజీవి ప్రత్యేకమే చిరంజీవి. హిట్లర్ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేటికీ ఈ సినిమాని మరచిపోలేము. నేటితో హిట్లర్ సినిమా 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. హిట్లర్ సినిమాకి ముందు చిరంజీవికి భారీ ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే హిట్లర్ సినిమా మాత్రం మెగాస్టార్ కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
Video Advertisement
రీమేక్ సినిమా అయినా కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం. అయితే ఈ సినిమా వెనుక ఒక పెద్ద కథ ఉంది. మరి దాని గురించి ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఈ చిత్రం విడుదల అయ్యి పాతికేళ్లు అయ్యింది. 1996 లో ఒక మలయాళం చిత్రం వచ్చింది దాని పేరు ‘హిట్లర్’.
ఆ సినిమాలో ముమ్మట్టి హీరో. సిద్ధిఖీ దర్శకత్వంలోదానిని రూపొందించారు. కానీ ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్నారు. ఆ చిత్రం విడుదల అవ్వకుండానే సినిమా ఎలా ఉంటుందో తెలియకుండా రైట్స్ కూడా తీసుకున్నారు.
మలయాళంలో విడుదలకి ఒక రోజు ముందు హైదరాబాద్ కి ఒక సీడీ వచ్చింది. అయితే హిట్లర్ సినిమాను చూడాలంటూ నిర్మాత ఎడిటర్ మోహన్ ప్రముఖ రైటర్ మరుధూరి రాజాకు చెప్పారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, రాజా అతడి భార్య కలిసి ఈ చిత్రాన్ని చూసారు. అప్పుడు ఇది హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఎడిటర్ మోహన్ చిరంజీవి హీరో కాకుండా మోహన్ బాబుని హీరోగా పెట్టాలని అనుకున్నారు.
దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణ అనుకున్నారు. రైటర్ మరుధూరి రాజాకు ఈ విషయం చెప్పగా.. మోహన్ బాబు చేతిలో అప్పటికే వీడెవడండీ బాబు, అదిరింది అల్లుడు సినిమాలున్నాయి. అందుకని మోహన్ బాబుని వద్దని.. చిరంజీవి హీరోగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాని చిరంజీవి చేస్తున్నాడంటూ ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరుధూరి రాజాకు చెప్పారు.
ఈ విషయంపై రాజా కూడా ఆనందించాడు. చిరంజీవి హీరోగా ఆఫర్ రావడంతో ఆనందానికి అవధులు లేవు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వచ్చాక రాజా కాకుండా ఎల్.బి.శ్రీరామ్ రైటర్ గా వచ్చారు. దీంతో రాజాకి బాధ వచ్చింది. ఫీల్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు.
ఎడిటర్ మోహన్ అడగడంతో ఒక వెర్షన్ కూడా రాసి ఇచ్చాడు. అయితే ఈ విషయాలన్నిటినీ కూడా రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఏది ఏమైనా చిరంజీవికి మంచి ఇమేజ్ ను తీసుకువచ్చింది ఈ సినిమా. 1997 సంక్రాంతి సీజన్లో వచ్చిన హిట్లర్ బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాకి పోటీ ఇచ్చింది.
పైగా మంచి హిట్ ను కూడా కొట్టింది. ఈ సినిమా చిరంజీవి ఎప్పుడూ ప్రత్యేకమే. చాలా ఫ్లాపుల తర్వాత మంచి హిట్ ని చిరంజీవికి హిట్లర్ తీసుకువచ్చింది. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మోహన్ రాజా ఇప్పుడు చిరంజీవి తో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. హిట్లర్ మొదలు గాడ్ ఫాదర్ వరకూ తన జర్నీని ఒకసారి మోహన్ రాజా గుర్తుచేసుకున్నాడు.
End of Article