Ads
హీరో నాని వరుస సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకి నాని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది.
Video Advertisement
నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో కూడా ఈ చిత్రం విడుదల అయ్యింది.
ఈ సినిమాలో విలన్ గా మనీష్ వాధ్వా నటించారు. మహంత్ పాత్ర చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు మనీష్ వాధ్వా. అంత అద్భుతంగా ఆ పాత్ర చేసినందుకు మెచ్చుకుని తీరాలి. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత బుల్లితెర నటుడుగా చాణక్యుడు పాత్రలతో ఫేమస్ అయ్యాడు మనీష్ వాధ్వా. నిజానికి ఆ పాత్ర లో ఈయన సూట్ అయ్యినట్టు మరెవ్వరు సూట్ అవ్వరు.
చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ సినిమాలలో కూడా చేసారు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ లో వున్నప్పుడు మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం వచ్చిందట.
End of Article