Ads
జీవితమంటే ఎల్లప్పుడూ పూల పరిమళంలా ఉండదు. ఒక్కొక్కసారి జీవితం మన చేజారి పోతుంది కూడా. అయినప్పటికీ కూడా విధిని ఎదిరించి నిలబడాలి. ప్రతిదీ కూడా తట్టుకోవాలి. నిజానికి మాళవిక అదే దారిలో వెళుతోంది. మాళవిక పట్టిన బాటని చూస్తే మెచ్చుకుని తీరుతారు. మాళవిక కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్.ఎం.కృష్ణ కూతురు. కేఫ్ కాఫీ డే తో అప్పులు చేసి దిక్కుతోచక మరణించిన సిద్ధార్థ్ భార్య ఆమె.
Video Advertisement
భర్త చనిపోయినప్పటికి కూడా ఆమె బాధలో మునిగిపోకుండా బాధ్యతల్ని తీరుస్తోంది. నిజానికి మాళవిక పడే కష్టం.. ఆమె చేస్తున్న పని చూస్తే అభినందిస్తారు. భర్త సిద్ధార్థ అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఎంతో కుమిలిపోయి మృతిచెందాడు. అయితే కుప్పకూలిపోయిన ఆ వ్యాపారాన్ని తిరిగి ఆమె నెమ్మది నెమ్మదిగా ఒక లైన్లో పెడుతోంది.
ఒకటిన్నర సంవత్సరం అవ్వకుండానే ఏడు వేల కోట్లు అప్పుని ఆమె మూడున్నర వేల కోట్లకి తీసుకు వచ్చేసింది. అంటే సంవత్సరానికి ఈమె మూడున్నర వేల కోట్లు సంపాదించింది. ఇదే తీరులో ఈమె వెళ్తే మొత్తం అప్పు అంతటినీ కూడా కొన్ని సంవత్సరాల్లో తీర్చేస్తుంది. అయితే నిజానికి ఇంత బరువుని ఆమె భుజాలపై వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది చేస్తున్నట్లు ఈమె కూడా అప్పు కి నాకు సంబంధం లేదంటూ విదేశాల్లో ఉంటూ హాయిగా జీవించొచ్చు.
కానీ తన భర్త అనుకుని చేయలేనిది ఈమె పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. కేఫ్ కాఫీ డే మొదట ఎలా నడపాలో ఆమెకి అర్థం కాలేదు. కానీ నెమ్మదినెమ్మదిగా కాలమే అన్నీ నేర్పిస్తుందని ఆమె అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అయితే కేఫ్ కాఫీ డే పరిగెడుతోంది.
షేర్స్ తీసుకోవడానికి టాటా వంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. అందరి అభిరుచులకు తగ్గట్టుగా కేఫ్ కాఫీ డే నడుస్తోంది. ఈమె ఇదే దారిలో వెళ్లి ఎందరికో ఆదర్శంగా నిలవాలి. తన భర్తలా మధ్యలో ఆగిపోకుండా తప్పకుండా గెలవాలని ఆశిద్దాం.
End of Article