Home Filmy Adda మహేష్ బాబు గురించి పిచ్చి ప్రశ్న వేసిన నెటిజెన్ కి స్ట్రాంగ్ పంచ్ వేసిన విజయశాంతి..!

మహేష్ బాబు గురించి పిచ్చి ప్రశ్న వేసిన నెటిజెన్ కి స్ట్రాంగ్ పంచ్ వేసిన విజయశాంతి..!

by Anudeep

కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సెలెబ్రిటీలలో కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలెబ్రిటీలందరు మహేష్ బాబు కోలుకోవాలంటూ ట్విట్టర్ మాధ్యమంలో ట్వీట్స్ పోస్ట్ చేసారు.

ఈ విషయమై విజయశాంతి కూడా స్పందించారు. మహేష్ బాబు గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ పోస్ట్ పై ఓ నెటిజెన్ పిచ్చి ప్రశ్నను సంధించారు.

vijayasanthi

మహేష్ బాబు గారు అని ఎందుకు..? మహేష్ బాబు అనొచ్చుగా మేడం.. అంటూ ప్రశ్నించారు. దీనిపై విజయశాంతి కౌంటర్ వేశారు. నాకు నా మెంటార్లు అట‌ల్ జీ మ‌రియు అద్వానీ జీ అలానే నేర్పించారు. వయసులో, అనుభవంలో నాకంటే పెద్దవారు అయినా పాలిటిక్స్ లో చిన్నపిల్లని అయిన నన్ను విజయశాంతి జీ అనే సంబోధిస్తారు అంటూ చురక అంటించారు.

You may also like