Ads
మన స్నేహితులని బట్టి మనం మారిపోతాం. వాళ్లకు ఉండే మంచి అలవాటు అయినా చెడు అలవాటు అయినా మనకి సులువుగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే మంచి అలవాట్లు వున్న వాళ్ళ తో స్నేహం చేయాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే అన్న గారు కూడా తన స్నేహితుడు దగ్గర నుండి ఓ చెడు అలవాటుని అలవాటు చేసుకున్నారట. అదే చుట్ట కాల్చడం.
Video Advertisement
ఎన్టీ రామారావు గారు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. అటు రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణించారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకు అన్నగారు ఆరాధ్య దైవంగా మారారు.
అయితే అన్న గారికి మాత్రం చుట్ట అలవాటయింది తన స్నేహితుడి దగ్గర నుంచి. ఆ స్నేహితుడు ఎవరో కాదు ప్రముఖ నటుడు ముక్కామల కృష్ణ మూర్తి గారు. ఈయన కూడా 300 కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఈయన అప్పట్లో విలన్ గా నటించి పాపులర్ అయ్యారు.
ముక్కామల కృష్ణమూర్తి గారు ఎన్టీ రామారావు గారు కాలేజీ రోజుల నుంచి కూడా మంచి స్నేహితులు. అన్న గారు, కృష్ణ మూర్తి గారు, జంధ్యాల గారు కలిసి కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేసే వారట. అప్పట్లో ముక్కామల కృష్ణ మూర్తి గారు చుట్ట తాగే వారు. ఆ అలవాటు ఎన్టీఆర్ గారికి కూడా వచ్చిందని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
End of Article