Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఏ సినిమాకి లేనంతగా రెండు విడుదల తేదీలను చిత్ర బృందం ప్రకటించింది.
మార్చి 18 వ తేదీన రిలీజ్ చేయడానికి టీం సిద్ధం గానే ఉందని.. అయితే.. కరోనా కారణంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సినిమాను ఏప్రిల్ 28 న విడుదల చేస్తామని రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించింది. అయితే.. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం ఇలా రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ఒక సినిమాకి ఇన్ని రిలీజ్ డేట్స్ పెట్టారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. కొందరు నెటిజన్స్ ఏప్రిల్ 28 నే విడుదల చేద్దాం అనుకోడానికి అసలు కారణం ఏంటా..? అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అదే రోజున ఇంతకు ముందు సంవత్సరాలలో విడుదల అయిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లని కూడా రాబట్టాయి.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ లెక్కలు వేసుకునే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఆ డేట్ ని ఎంచుకున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయమై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నాలుగు సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
#1. అడవి రాముడు:
#4. బాహుబలి 2:
End of Article