Ads
మోడల్ గా రాణించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా నటించి కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది పూజ. ఆ తర్వాత నాగచైతన్య సరసన లైలా కోసం సినిమాల్లో నటించింది. అయితే అప్పటి వరకు పూజ కి హిట్స్ ఏమి లభించలేదు.
Video Advertisement
కానీ అల్లు అర్జున్ తో కలిసి నటించిన దువ్వాడ జగన్నాధం సినిమా మాత్రం ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. అక్కడే ఆమె కెరీర్ కూడా టర్న్ అయ్యింది. 2017 లో ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు. దువ్వాడ జగన్నాథం చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత పూజ రేంజ్ కూడా పెరిగిపోయింది.
తర్వాత మరెన్నో అవకాశాలు కూడా పూజ హెగ్డే కి వచ్చాయి. అయితే ఇది నిజంగా పూజ హెగ్డే అదృష్టం అని చెప్పాలి. ఈ అవకాశం పూజకి మామూలుగా రాలేదు. శృతి హాసన్ ఈ సినిమాని రిజక్ట్ చేస్తే అప్పుడు ఆ అవకాశం పూజా హెగ్డేకి వచ్చింది. మొదట అల్లు అర్జున్ సరసన శృతి హసన్ నటిస్తే బాగుంటుందని డైరెక్టర్ హరీష్ శంకర్ శృతి హాసన్ ని సంప్రదించారు.
కానీ శృతి హాసన్ ఈ ఆఫర్ ని రిజక్ట్ చేసింది. దీంతో పూజా హెగ్డే కి ఈ అవకాశం వచ్చింది. ఏది ఏమైనా సరే పూజా హెగ్డే కి దువ్వాడ జగన్నాథం మంచి హిట్ ని తీసుకు వచ్చింది. శృతిహాసన్ ఇలా పూజా కెరీర్ కి సాయం చేసినట్లు అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలలో నటించింది. అలానే బీస్ట్ అనే తమిళ సినిమా కూడా చేయనుంది.
End of Article