“కాజల్ అగర్వాల్”తో పాటు… “అఖండ”ని రిజెక్ట్ చేసిన 4 హీరోయిన్స్..!

“కాజల్ అగర్వాల్”తో పాటు… “అఖండ”ని రిజెక్ట్ చేసిన 4 హీరోయిన్స్..!

by Mohana Priya

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్ రెండున అఖండ విడుదల అయ్యింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

akhanda movie review

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. అయితే ప్రజ్ఞా జైస్వాల్ కంటే ముందు ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లని అనుకున్నారట. కానీ వాళ్ళు అందరూ కూడా ఏవో కారణాల వల్ల ఈ సినిమాలో చేయలేకపోయారు. అలా అఖండ రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రకుల్ ప్రీత్ సింగ్

సరైనోడు, జయ జానకి నాయక తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మళ్లీ అఖండ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ రకుల్ ఈ సినిమాని తిరస్కరించినట్టు సమాచారం.

heroines who rejected akhanda

#2 కాజల్ అగర్వాల్

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని కూడా సంప్రదించారు అని, కానీ కాజల్ ఈ సినిమా చేయలేకపోయారు అనే వార్తలు వస్తున్నాయి.

heroines who rejected akhanda

#3 కేథరిన్ ట్రెసా

అఖండ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ ని కూడా అనుకున్నారట. కానీ కేథరిన్ కూడా ఈ సినిమాని తిరస్కరించారు అనే వార్త వచ్చింది.

heroines who rejected akhanda

#4 పాయల్ రాజ్ పుత్

ఈ సినిమా కోసం పాయల్ రాజ్ పుత్ ని సంప్రదించగా, పాయల్ కూడా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయారు.

heroines who rejected akhanda

తర్వాత ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.


End of Article

You may also like