Ads
కీర్తి సురేష్ మహానటి తర్వాత వరుసగా కొన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అందులో ఒకటి పెంగ్విన్, మరొకటి మిస్ ఇండియా. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. నితిన్ తో పాటు నటించిన రంగ్ దే సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మహానటి తర్వాత థియేటర్లలో విడుదల అయిన కీర్తి సురేష్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి.
Video Advertisement
ఈ మధ్యలో సర్కార్, సామి స్క్వేర్, పెద్దన్న వంటి డబ్బింగ్ సినిమాలతో కూడా మన ముందుకు వచ్చారు కీర్తి. కానీ ఇందులో సర్కార్ తప్ప చాలా వరకూ మిగిలిన సినిమాలు ఏవి ఆశించిన ఫలితాన్ని పొందలేదు. అయితే కీర్తి సురేష్ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మహానటి తర్వాత మళ్లీ అంత మంచి రోల్ కీర్తి సురేష్ ఎప్పుడు చేస్తారు? అంత మంచి హిట్ మళ్ళీ కీర్తి సురేష్ కి ఎప్పుడు వస్తుంది? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇలా ఎదురు చూసిన ప్రతిసారి నిరాశే ఎదురయింది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 ముందుగా మనం ఒకసారి కీర్తి సురేష్ నటించిన సినిమాలు గమనిస్తే, మహానటికంటే ముందు కీర్తి సురేష్ అంత బాగా నటించిన సినిమాలు తక్కువే. ధనుష్ హీరోగా నటించిన తొడరి సినిమాలో కీర్తి సురేష్ నటన బాగుంటుంది. ఈ సినిమాకి కీర్తి సురేష్ కి ఎంతో గుర్తింపు లభించింది. కానీ అంతకు ముందు నటించిన సినిమాల్లో కీర్తి పాత్ర మామూలు హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది.
#2 మహానటి వరకు కీర్తి సురేష్ కొంచెం బొద్దుగా ఉండేవారు. ప్రేక్షకులు కూడా కీర్తి సురేష్ ని అలాగే ఇష్టపడ్డారు. కానీ మహానటి తర్వాత మెల్లగా బరువు తగ్గడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల్లో కీర్తి సురేష్ ని చూసిన ప్రేక్షకులు, “ఏంటి కీర్తి ఇలా అయిపోయారు?” అని అనుకున్నారు. తర్వాత సినిమాల్లో కూడా చాలా డల్ గా కనిపించారు. దాంతో కీర్తి మళ్లీ మామూలుగా అయితే బాగుంటుంది అని చాలా మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
#3 పాత్రల సెలక్షన్ విషయంలో కూడా కీర్తి సురేష్ కొన్ని పొరపాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమాల్లో తన పాత్రకి పెద్దగా స్కోప్ ఏమీ లేదు. అలాగే మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం కీర్తి సురేష్ ని సంప్రదించారు. కానీ కీర్తి సురేష్ ఈ సినిమా వదులుకొని పెద్దన్న సినిమా చేసినట్టు సమాచారం. పెద్దన్న సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అంత కొత్తగా ఏమీ లేదు. ఆ పాత్రలో ఎవరైనా సరే చేయగలుగుతారు. “ఈ పాత్ర కీర్తి సురేష్ మాత్రమే చేయగలరు” అని అనుకునే పాత్ర మళ్లీ కీర్తి సురేష్ కి రాలేదు.
#4 కీర్తి సురేష్ నటించిన మూడు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా కథ చాలా బలహీనంగా ఉంది. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాల్లో వాళ్ళు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఆడవాళ్లు ఏదైనా సాధించాలి అని ప్రోత్సహించేలాగా ఆ స్టొరీ లైన్ ఉంది. కానీ డైరెక్టర్ ఆ కథని తెరపై తీసుకురావడంలో చాలా పొరపాట్లు జరిగాయి. దాంతో ఈ రెండు సినిమాలకి కూడా అనుకున్న స్థాయిలో స్పందన లభించలేదు. ఇది కీర్తి సురేష్ కెరీర్ మీద కూడా ప్రభావం చూపింది.
#5 ఇలా ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాకూడా కీర్తి సురేష్ కి వరసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ రాబోయే సినిమాలు కూడా పెద్ద పెద్ద హీరోలతోనే ఉన్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట అయితే, మరొకటి తలపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా. ఈ రెండు సినిమాల్లో హీరో స్టార్ పవర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమాల్లో కీర్తి సురేష్ పాత్రకి మహానటి రేంజ్ లో అయితే స్పందన వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
దాంతో మళ్ళీ కీర్తి అంత స్టార్ డమ్ సంపాదించాలి అంటే మహానటి ఇలాంటి ఒక మంచి పవర్ ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రావాల్సిందే. ఒకవేళ అదే గనుక జరిగితే మళ్లీ కీర్తి అప్పటి క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం. అప్పుడు కీర్తి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు.
End of Article