Ads
తప్పు చేస్తే తిట్టడం, మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే కాస్త గట్టిగా తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఎవ్వరూ ప్రవర్తించరు. ఆమె ప్రవర్తన చూస్తే నిజంగా మనిషేనా అని అనిపిస్తుంది. ఇదేమీ కధ కాదు. నిజంగా జరిగిన ఒక సంఘటన. ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే ఆఖరికి పోలీసులు కూడా ఏడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. మరి ఇక ఆమె చేసిన తప్పేమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఒక ఇరవై నాలుగేళ్ళ మహిళని టార్చర్ చేసింది సింగపూర్ గాయత్రీ. కొట్టడం, తిట్టడం మాత్రమే కాకుండా కాల్చడం, అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చేయడం ఇలా చెప్పుకుపోతే ఈమె చేసినవి చాలా ఉన్నాయి. డబ్బులు కోసం కష్టపడి సంపాదించుకోవాలని సొంత ఊరుని వదిలేసి పని కోసం మైన్మార్ నుండి సింగపూర్ వెళ్ళింది ఒక మహిళ. ఆమె వయసు 24 సంవత్సరాలు. ఆమె పేరు పియాంగ్. సాధారణంగా ఊర్లో పని చేసుకుంటే తక్కువ డబ్బులు ఇస్తారు. అందుకని ఆమె సింగపూర్ వెళ్లాలని అనుకుంది.
కష్టపడి డబ్బులు సంపాదించి తన చెల్లెళ్లకి, కొడుకుకి చదువు చెప్పించాలని అనుకుంది. ఆమె మొదట పని కోసం వెళ్లగా.. కన్స్ట్రక్షన్ వర్క్ లో పని దొరికింది. అక్కడ పని చేసింది. ఆ తర్వాత ఆమె ఎవరైనా ఇళ్ళల్లో పని చేస్తే వాళ్ళు తిండి పెడతారు కాబట్టి వచ్చిన జీతం అలా ఇంటికి పంపించాలని అనుకుంది. దీంతో ఆమె సింగపూర్ గాయత్రి దేవి ఇంట్లో పని లో చేరింది. మొదట నెల జీతం సరైన సమయానికి ఇచ్చేశారు. కానీ ఏమైనా పనుల్లో తప్పులు చేస్తే తిడుతూ ఉండేవారు. పైగా ఆమెకి సిటీ కల్చర్ కొంచెం కొత్త కనుక కాస్త ఇబ్బంది పడేది. సింగపూర్ గాయత్రి తో పాటు తన భర్త మరియు తన తల్లి కూడా ఈమెని దూషించే వారు.
ఏమైనా పొరపాట్లు చేస్తే గట్టిగా తిట్టేవారు. అంతటితో ఆగక కొట్టేవారు కూడా. అయితే జీతం సరైన సమయానికి ఇచ్చారన్న ఒక్క కారణంతో ఆమె ఇక్కడే పని చేయాలని అనుకుంది. ఒకసారి ఈమె బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటే ఏదో పొరపాటు చేసిందని ఆ ఇస్త్రీ పెట్టెతో కాల్చేసింది గాయత్రి దేవి. నిజానికి గాయత్రి దేవి సైకో లాగ ఉండేది. పైగా ఇంట్లో వాళ్ళు మాత్రమే కాకుండా పక్కన ఉన్న బంధువులు వాళ్లు కూడా వచ్చి ఈమెను తిట్టేవారు, కొట్టేవారు. ఒకరోజు పియాంగ్ బయటకి పారిపోవాలని అనుకుంది.
అయినప్పటికీ కుదరలేదు. ఆమెని గొలుసులతో కట్టేసే వారు. లేదంటే ఆటోమేటిక్ లాక్ కూడా వేసేవారు. అది పాస్వర్డ్ తెలిస్తేనే ఓపెన్ చేయడానికి అవుతుంది. ప్రతిరోజు ఈ హింసలని ఆమె భరించేది. తిండి కూడా సరిగా పెట్టేవారు కాదు మిగిలిన భోజనమే తినాలి అని చెప్పేవారు. ఈ క్రమంలో ఆమె ఇరవై నాలుగు కేజీలు తగ్గిపోయింది. అయితే ఒకరోజు కట్టేసిన గొలుసులుకి వేలాడుతూ కనిపించింది పియాంగ్. డాక్టర్ కి ఫోన్ చేశారు.
డాక్టర్ వచ్చి గాయాలని చూసి షాక్ అయ్యారు. అయితే వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయింది. అలా చెప్తే గాయత్రీ దేవి బయట పడిపోతుందని డాక్టర్ తెలివిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చాక ఆమె చనిపోయిందని వీళ్ళు కొట్టి చంపేశారని డాక్టర్ చెప్పారు. ఒంటి మీద ఉన్న గాయాలు అన్నిటినీ పరిశీలించి గాయత్రి దేవిని పోలీసులు కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గాయత్రి దేవి ప్రవర్తన చూసి ఛీ అంటున్నారు. పియాంగ్ ఒంటిమీద 64 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. కొన్ని ఎముకలు కూడా విరిగి పోయాయి. బ్రెయిన్ రక్తంతో నిండి వుంది. తలపై గట్టిగా కొట్టడం వల్ల ఈమె చనిపోయింది అని తేలింది. ఇది చూసి ఈమె మనిషా రాక్షస అని అంటున్నారు అంతా.
End of Article