Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన సినిమాలు కూడా కొన్ని వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. మన తెలుగు సినిమాలని బెంగాలీలో రీమేక్ చేశారు. వాటిలో చాలా వరకు మన స్టార్ హీరోలు నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలే ఉన్నాయి. ఆ సినిమాల్లో కొన్ని ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 ఛత్రపతి
ఈ సినిమాని బెంగాలీలో రెఫ్యూజీ పేరుతో రీమేక్ చేశారు.
#2 మిర్చి
ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాని బెంగాలీలో బిందాస్ పేరుతో రీమేక్ చేశారు.
#3 మగధీర
మగధీర సినిమాని బెంగాలీలో యోధ పేరుతో రీమేక్ చేశారు.
#4 ఒక్కడు
ఒక్కడు సినిమాని జీత్ పేరుతో రీమేక్ చేశారు.
#5 డార్లింగ్
డార్లింగ్ సినిమాని బెంగాలీలో డార్లింగ్ పేరుతో రీమేక్ చేశారు.
#6 రెబెల్
రెబల్ సినిమాని బెంగాలీలో హీరో – సూపర్ స్టార్ పేరుతో రీమేక్ చేశారు.
#7 బిజినెస్ మాన్
బిజినెస్ మాన్ సినిమాని బెంగాలీలో బాస్ పేరుతో రీమేక్ చేశారు.
#8 అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేది సినిమాని బెంగాలీలో అభిమాన్ పేరుతో రీమేక్ చేశారు.
#9 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాని బెంగాలీలో 100 పర్సెంట్ లవ్ పేరుతో రీమేక్ చేశారు.
#10 ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాని బెంగాలీలో దాదా పేరుతో రీమేక్ చేశారు.
#11 నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో సినిమాని బెంగాలీలో బాజీ పేరుతో రీమేక్ చేశారు.
#12 దూకుడు
దూకుడు సినిమాను బెంగాలీలో ఛాలెంజ్ 2 పేరుతో రీమేక్ చేశారు.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా తెలుగు సినిమాలని బెంగాలీలో రీమేక్ చేశారు.
End of Article