Ads
వెంకటేష్ హీరోగా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సినిమా దృశ్యం 2. ఈ సినిమా 2014లో విడుదలైన దృశ్యం సీక్వెల్. మలయాళ సినిమా దృశ్యంకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందించారు.
Video Advertisement
ఈ తెలుగు సీక్వెల్‌కి కూడా మలయాళం సినిమాకి దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం సినిమా మొదటి భాగానికి కొనసగింపుగానే మొదలవుతుంది. ఆ సంఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత మళ్లీ రాంబాబు కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కుంది అనే విషయం చుట్టూ సినిమా నడిస్తుంది.
మొదటి భాగాన్ని, రెండవ భాగాన్ని పోల్చి చూస్తే, రెండవ పార్ట్ లో సస్పెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సినిమా చాలా మామూలుగా మొదలవుతుంది. అసలు ఏం జరుగుతోంది అనేది కొంత సమయం వరకు అర్థం కాదు. కానీ సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ సస్పెన్స్ మొదలవుతుంది.ఎప్పుడైతే సినిమాలోని అసలు పాయింట్ తెరపై చూపించారో, అప్పటినుండి కథ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. అయితే, ఒకసారి నారప్ప, దృశ్యం-2 సినిమాలని పరిశీలిస్తే ఈ రెండిటికీ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలు.
#2 రెండు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాయి.
#3 రెండిట్లో వెంకటేష్ కమర్షియల్ హీరోలాగా కాకుండా ఒక సాధారణ మధ్యవయస్కుడుగానే కనిపించారు. అంటే ఈ రెండు సినిమాల్లో హీరోయిజం కంటే కథే ముఖ్య పాత్ర పోషిస్తుంది.
#4 రెండిట్లో కూడా కొన్ని హత్యల కారణంగా వెంకటేష్ పాత్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రెండు సినిమాలు కొన్ని గొడవల చుట్టు తిరుగుతాయి. కానీ ఆ గొడవల్లో ఇరుక్కున్నది వెంకటేష్ పాత్ర మొదటి సంతానం అయ్యి ఉంటారు. దృశ్యం-2 సినిమాలో రాంబాబు పెద్ద కూతురు సమస్యలో ఇరుక్కొని ఉంటుంది. నారప్ప సినిమాలో కూడా నారప్ప మొదటి కొడుకు అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఈ రెండు సినిమాల్లో ఈ సంఘటనల తర్వాత వెంకటేష్ పాత్ర కుటుంబమంతా సమస్యలను ఎదుర్కొంటుంది. దాంతో ఆ సమస్యలనుండి వారిని బయట పడేస్తారు వెంకటేష్.
ఇలా తెలియకుండానే ఈ రెండు సినిమాల్లో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి.
End of Article