Ads
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన “ఛత్రపతి” మూవీని మనం అంత ఈజీగా మరచిపోలేము. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచింది.ఈ సినిమా 2005 లో విడుదల అయింది. శ్రీయ ఈ సినిమాలో హీరోయిన్ నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Video Advertisement
ఒక తల్లి, ఇద్దరు కొడుకులు జీవితంలో ఏమి జరిగింది.. సవతి కొడుకైన హీరో తల్లికి ఎలా దూరం అవ్వాల్సి వచ్చింది.? తిరిగి తల్లిని వెతకడానికి అతను ఎన్ని పాట్లు పడతాడు? చివరకు ఎలా తల్లికి చేరువవుతాడు అన్న పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.
తల్లి కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా గట్టిగానే పండాయి. ఇక మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఛత్రపతి సినిమాను హిందీలో డబ్ చేసినా కూడా మంచి యూట్యూబ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి చేశారు.
అదేంటంటే, ఛత్రపతి సినిమాలో హీరోకి వచ్చే ఒక మ్యూజిక్ అంతకుముందు చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మాకి, చిరంజీవికి మధ్య వచ్చే ఒక సీన్ లో ఒక మ్యూజిక్ ని పోలి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకి కీరవాణి సంగీత దర్శకత్వం అందించారు. ఇలా కేవలం కీరవాణి మాత్రమే కాదు. ఎంతో మంది సంగీత దర్శకులు అంతకుముందు తమ సినిమాల్లో ఉపయోగించిన ఒక మ్యూజిక్ ని వేరే సినిమాల్లో కూడా ఉపయోగిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.
watch video :
https://www.instagram.com/reel/CZMOzPvOuX9/?utm_medium=copy_link
End of Article