Ads
ఒక ఇంట్లో భర్త, కొడుకు చనిపోయారు. అయితే ఎవరు చంపారు అనేది ప్రశ్నార్థకం. పోలీసులు కూడా ఎవరు చంపారో తెలుసుకోలేక పోయారు. ఆఖరికి ఆ కేసును పక్కన పెట్టేశారు. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు ఒక ఆమె దగ్గరికి వెళ్లి నా సోదరుడుని చంపిన వ్యక్తిని కనిపెట్టమని చెప్పాడు. ఒకవేళ కనుక ఎవరు చంపారు అన్నది కనిపెడితే ఎంత డబ్బు అయినా ఇస్తానని చెప్పాడు. ఆ మహిళా పని మనిషి కింద ఓ ఇంట్లోకి వెళ్లింది. ఎలా అయినా సరే భర్తని, కొడుకుని చంపేసిన వాళ్ళని కనిపెట్టాలని అనుకుంది. ఇంట్లో చక్కగా కలిసిపోయింది. ఆ భార్య కూడా ఆమెను నమ్మింది.
Video Advertisement
సొంత చెల్లిలాగే భావించింది. చాలా నమ్మకంగా ఇంట్లో పని చేయడం మొదలు పెట్టింది ఆ పని మనిషి. అయితే ఆమె ఏ పని చేసినా సరే దృష్టి మాత్రం ఇన్వెస్టిగేషన్ పైనే ఉండేది. అయితే ఒకరోజు రూమ్ లో సౌండ్ రికార్డర్ వినిపించింది. దీంతో ఆ మహిళ కి అనుమానం వచ్చింది. పని మనిషే ఈ పని చేసిందేమో అని అనుమాన పడింది. ఇంతవరకు లేని వస్తువు ఎలా వచ్చింది అని అనుకుంది. అటక మీద ఆ సౌండ్ రికార్డర్ దొరికింది. పనిమనిషి పోలీస్ ఏమో అని ఆమెకి సందేహం కలిగింది.
ఈ పని మనిషిని చంపాలని ఒక వ్యక్తి తో ఈమె మాట్లాడింది. ఆ విషయం కూడా పనిమనిషికి తెలిసిపోయింది. ఆ తరవాత ఎలా అయినా సరే ఆ పని మనిషి బయటకు వెళ్ళకుండా చేయాలని ఆమెని బంధించేసింది. ఇంతలో ఒక వ్యక్తి పని మనిషిని చంపడానికి ఇంట్లోకి వచ్చాడు. అయితే పని మనిషికి ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆమె కత్తితో వేలు కోసుకుని బ్యాండేజ్ తెచ్చుకుని వస్తాను అని బయటకు వెళ్లింది. నిజంగా రక్తం రావడంతో మహిళ నమ్మేసింది. కాసేపు తర్వాత ఆమె వచ్చి బయట నుండి ఇంటికి తాళం వేసి పోలీసుల్ని తీసుకువచ్చింది.
ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. భర్త పేరు మీద ఉన్న ఆస్తులు కొట్టేయడానికి ప్రియుడితో కలిసి భర్తని అనుమానం వస్తుందని కొడుకుని కూడా చంపించేసింది ఆ మహిళ. అయితే ఇంటికి వచ్చిన పని మనిషి ఎవరో కాదు ఒక డిటెక్టర్. ఆమె పేరు రజని పండిట్. ఈమె చాలా పెద్ద పెద్ద కేసుల్ని సాల్వ్ చేశారు. ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద కేసులలో నేరస్తుల్ని కనిపెట్టేసారు. 22 ఏళ్ళ సర్వీసులో ఈమె 80వేల కేసుల్ని సాల్వ్ చేశారు.
End of Article