Ads
శ్రీహరి గురించి అందరికీ తెలుసు. రియల్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించారు శ్రీహరి. ఒక విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరో గా ఇలా ఏ పాత్రనైనా సరే అద్భుతంగా చేసేస్తారు శ్రీహరి. మంచి ఫేమ్ ఉన్న సమయంలో ఆయన చనిపోవడం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. శ్రీహరి దేవా, సాంబయ్య, పోలీస్, భద్రాచలం వంటి సినిమాల్లో నటించి హిట్లు కూడా అందుకున్నారు.
Video Advertisement
కొంత కాలం హీరోగా నటించి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. శ్రీహరి వందకు పైగా చిత్రాల్లో నటించి ఎంతో పాపులర్ అయ్యారు. శ్రీహరి 1996 లో డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పైగా అప్పట్లో ఆమె ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఓ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐటమ్ సాంగ్స్ కూడా ఆమె చేసేవారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా డిస్కో శాంతి నటించారు.
Also Read: సీతారామం హీరోయిన్ “మృణాల్ ఠాకూర్” కి… బాహుబలికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ కి వచ్చి కొన్ని విషయాలను పంచుకున్నారు. తన భర్త శ్రీహరి మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెప్పారు. పైగా ఆయన బతికున్న రోజుల్లో ఇంటికి ఎవరు వచ్చినా సరే సహాయం చేసే వారు శ్రీ హరి అని చెప్పారు.
ఆయన ఉన్నప్పుడు ఎన్నో కోట్లు సంపాదించారు. కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ పరిస్థితి కాస్త ఘోరంగా మారింది అని డిస్కో శాంతి చెప్పారు. శ్రీహరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మేఘాంశ్ రాజ్ దూత్ అనే సినిమా చేశాడు. ఈ మూవీ అనుకున్నంత హిట్ అవ్వలేకపోయింది. మంచి హిట్ కోసం చూస్తున్నాడు మేఘాంశ్.
watch video:
Also Read: ఈ 3 నందమూరి హీరోలకి… ఆ “సెంటిమెంట్” కలిసి వచ్చిందా..?
End of Article