Ads
ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే రోజు “వాలెంటైన్స్ డే”.. ఈరోజున ప్రేమలో ఉన్నవారు తన ప్రేయసి/ప్రియుడికి తమ ప్రేమకు చిహ్నం గా బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వారం రోజుల ముందునుంచి సెలెబ్రేట్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఫిబ్రవరి 14 కు సరిగ్గా వారం ముందు అంటే ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి ఈ సందడి మొదలవుతుంది. అసలు ఈ వాలెంటైన్స్ డే ను ఎందుకు జరుపుకుంటున్నాం..
క్రీస్తు శకం 270 కాలంలో రోమ్ లో వాలెంటైన్ అనే క్రైస్తవ మత గురువు ఉండేవాడు. ఆయన హింసని వ్యతిరేకించి ప్రేమని ప్రోత్సహించేవాడు. మహిళలను అతి క్రూరంగా హింసించే ఆ కాలంలో.. మహిళలకు ప్రేమని పంచాలని చెప్పేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాలను యువతీ, యువకులకు తెలిపేవారు. ప్రేమ చిగురించేలా కృషి చేసారు. యువతీ యువకులు ప్రేమించుకుంటే.. వారికి దగ్గరుండి పెళ్లి చేసేవాడు. అయితే, ఆ కాలం లో రోమన్ చక్రవర్తి గా ఉన్న క్లాడియస్ కు ప్రేమ అన్నా, వివాహం అన్నా ఏహ్య భావం ఉండేది. దీనితో ఆయన పెళ్లిళ్లపై నిషేధం విధించాడు.
వాలెంటైన్ కారణం గా రాజ్యం లో ఎక్కువ గా ప్రేమ పెళ్లిళ్లు జరిగేవి. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వాలెంటైన్ ను బంధించాడు. అతను రాజద్రోహం చేశాడంటూ..అతనిపై ఆరోపణలు కురిపించి అతన్ని క్రూరం గా శిక్షించాడు. అతను జైలు లో ఉన్న సమయం లో జైలు అధికారి కూతురిని అతడు ప్రేమించాడు. చివరకు వాలెంటైన్ ను ఫిబ్రవరి 14 న ఉరి తీశారు. చనిపోయే చివరి క్షణం వరకు అతను ఆమెను తలుచుకుంటూనే ఉన్నాడు. ఆమె ప్రేమిస్తున్నానని చెబుతూ.. ఆమెకు ఒక లేఖ కూడా రాసాడు. చివరిలో యువర్ వాలెంటైన్ అని పేర్కొన్నాడు. అలా… అతని పేరు ప్రేమికులకు పర్యాయపదం గా మారిపోయింది.
#6.
ఫిబ్రవరి 7 వ తేదీన రోజ్ డే గా ఈ వాలంటైన్ వీక్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ప్రేమికులు తమ ప్రేమకు చిహ్నంగా రోజా పువ్వుని ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే.. ఈ మధ్య ఈ హడావిడి ఎక్కువ అవుతుండడంతో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తెగ హల్ చల్ చేస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
End of Article












