Ads
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన నటనతో, డైలాగ్స్‌తో, డాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు.
Video Advertisement
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఎప్పుడూ కూడా తనదైన మార్క్‌ను ఏర్పరుచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అంతకు ముందు కొంచెం లావుగా ఉండేవారు. యమదొంగ సినిమాకి ముందు జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. రాఖీ వరకు కొంచెం బరువుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కొంత సమయం తీసుకొని యమదొంగ సినిమాలో కొత్తగా కనిపించారు. అప్పటి నుండి ప్రతి సినిమాకి ఒక స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి, “లావు తగ్గితే కానీ నీతో సినిమా చెయ్యను” అని ఒక డైరెక్టర్ చెప్పారట.
ఆయన ఎవరో కాదు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. యమదొంగ సినిమాకి ముందు జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళి కథ చెప్పి, “నీతో సినిమా చేయాలంటే నువ్వు బరువు తగ్గాలి” అని చెప్పారట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బరువు తగ్గడానికి ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. యమదొంగ సినిమా కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లోనే ఆర్ఆర్ఆర్ రాబోతోంది.
End of Article