Ads
మహేష్ బాబు కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయిన సినిమా పోకిరి. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్‌ని పోకిరికి ముందు, పోకిరికి తర్వాత అని అనొచ్చు. మహేష్ బాబుకి ఒక స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా పోకిరి. అప్పటివరకు మహేష్ ని ఇలాంటి పాత్రలో చూడలేదు. ఇంక పూరి జగన్నాధ్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
హీరో పాత్రలని నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. మామూలుగా తిరిగే ఒక వ్యక్తి చివరికి పోలీస్ అని తెలియడమే ఈ సినిమాకి ఒక పెద్ద ట్విస్ట్. పోకిరి సినిమాని తర్వాత చాలా భాషల్లో రీమేక్ చేశారు.
పోకిరి సినిమాకి మహేష్ బాబు పాత్ర ఎంత పెద్ద హైలెట్ అయ్యిందో, ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అంతే పెద్ద హైలైట్ గా నిలిచింది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ తప్ప ఇంకెవరు చేసిన బాగోదు ఏమో అన్నంత బాగా నటించారు ప్రకాష్ రాజ్. అందుకే తెలుగులో మాత్రమే కాకుండా పోకిరి హిందీ, తమిళ్ రీమేక్స్ లో కూడా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాకి స్క్రిప్ట్ అసోసియేట్ గా ఒక ప్రముఖ డైరెక్టర్ పనిచేశారు.
ఆయన మరెవరో కాదు మెహర్ రమేష్. ఆ తర్వాత మెహర్ రమేష్ కంత్రి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తర్వాత బిల్లా, శక్తి, షాడో సినిమాలకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఈ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
End of Article