“ఎమ్మెస్ నారాయణ” చివరి క్షణాల గురించి వింటే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే 15 నిమిషాల ముందు… పేపర్ పై రాసి..?

“ఎమ్మెస్ నారాయణ” చివరి క్షణాల గురించి వింటే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే 15 నిమిషాల ముందు… పేపర్ పై రాసి..?

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే గుర్తొచ్చే నటుల్లో ఒకరు ఎమ్మెస్ నారాయణ. ఎన్నో సంవత్సరాలు తన కామెడీతో నటనతో మనల్ని అలరించిన ఎమ్మెస్ నారాయణ, కొంత కాలం క్రితం ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఎమ్మెస్ నారాయణ లేని లోటు తీర్చలేము. ఎమ్మెస్ నారాయణ చివరిగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించారు.

Video Advertisement

ఇందులో కూడా డబ్బింగ్ సమయానికి ఎమ్మెస్ నారాయణ లేకపోవడంతో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు. ఎమ్మెస్ నారాయణకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఎమ్మెస్ నారాయణ చనిపోయే ముందు ఒక సంఘటన జరిగింది.

1 ms narayana

ఆ విషయం గురించి బ్రహ్మానందం ఇటీవల ఆలీతో సరదాగా షోలో చెప్పారు. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ గురించి మాట్లాడుతూ, చనిపోయే ముందు ఎమ్మెస్ నారాయణ తనని చూడాలి అనుకుంటున్నారు అని, ఆ విషయాన్ని ఎమ్మెస్ నారాయణ ఒక పేపర్ పై రాసి తన కూతురికి చూపించారు అని, ఎమ్మెస్ నారాయణ  కూతురు తనకి ఈ విషయం చెప్పారు అని చెప్పారు. ఈ విషయం తెలియడంతో బ్రహ్మానందం షూటింగ్ నుండి కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.

brahmanandam shares about ms narayana last days

అక్కడ ఎమ్మెస్ నారాయణ బ్రహ్మానందంని, అలాగే పక్కనే ఉన్న ఎమ్మెస్ నారాయణ కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెస్ నారాయణని అలా చూడడం తనకు చాలా బాధగా అనిపించింది అని అన్నారు. అక్కడే కాసేపు ఉండి దుఃఖంతో ఏం మాట్లాడలేక బ్రహ్మానందం వెళ్ళిపోయారు. బ్రహ్మానందం వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఎమ్మెస్ నారాయణ చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎమ్మెస్ నారాయణ తనకి దేవుడు ఇచ్చిన తమ్ముడు అని అన్నారు బ్రహ్మానందం.


End of Article

You may also like