Ads
ఇది వరకు ఎంతో కష్టపడితే కాని పేరు వచ్చేది కాదు. కానీ ఈమధ్య సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సడన్ గా చాలా మంది స్టార్స్ కింద మారిపోతున్నారు. గుర్తింపు కూడా వస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
Video Advertisement
తాజాగా ఒక వ్యక్తి సెన్సేషన్ కింద మారిపోయారు. మరి అతని కోసమే ఇప్పుడు చూద్దాం. ఇతను వెస్ట్ బెంగాల్ లో ఉంటారు. ఇతని పేరు భువన్ బాడ్యాకర్, ఇతను చాలా పేద వ్యక్తి.
https://youtu.be/wBXGQ3rulPg
ఇతను వస్త్రధారణ, పాత సైకిల్ ఇవన్నీ చూస్తే అతను పేదవాడు అని ఎవరైనా చెప్పేస్తారు. ఇతను వీధి వీధి తిరిగి పల్లీలని అమ్ముతూ జీవనాన్ని సాగిస్తున్నారు. రోజుకి 200 నుండి 300 రూపాయల వరకు వస్తే చాలు అని ఇతను వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతనికి ఒక ఐడియా వచ్చింది. అదే ఇప్పుడు అతన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా మార్చేసింది. తనకి తానుగా లిరిక్స్ రాసుకుని పాటని పాడాడు. పాటకి మెచ్చి పల్లీలని కూడా ఎగబడి కొనేవారు.
జనం పల్లీలు తీసుకుని పాటని పాడించుకొనేవారు. అయితే ఒక వ్యక్తి అతను పాడిన పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది భువన్ జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పాట వినబడుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ పాట బాగా అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విదేశాలలో కూడా ఈ పాట బాగా పాపులర్ అయిపోయింది.
అక్కడ వాళ్ళ కూడా దీనికి ఫిదా అయిపోయారు. అయితే తనకు మాత్రం డబ్బులు రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ పాటతో చాలా మందికి వ్యూస్ కూడా వస్తున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా సరే ఫలితం లేకపోయింది. అయితే ఒక మ్యూజిక్ కంపెనీ మాత్రం తన చేత పాట పాడించుకుంది. అతని లుక్ ని కూడా మ్యూజిక్ కంపెనీ మార్చేసింది. కచ్చ బాదం పాటని ర్యాప్ వెర్షన్ లో రీమేక్ చేశారు. భువన్ పాడినందుకు ఆర్థిక సహాయం కూడా కంపెనీ అందించింది.
End of Article