Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చెయ్యక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ లో అగ్రతారలలో ఒకరిగా పేరు పొందారు. తండ్రి కృష్ణ లాగే తాను కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరులో ఒక రికార్డును క్రియేట్ చేశారు.
Video Advertisement
ఆ రికార్డును ఇప్పటి వరకు మరెవరూ దాటలేక పోయారు. మహేష్ బాబు సినిమా అంటే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సినిమాలు చూడడానికి వస్తారు.
ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల కంటే కూడా గుంటూరు జిల్లాలో మహేష్ బాబుకి అభిమానులు ఎక్కువ. మహేష్ బాబు సొంత ఊరు గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం. కృష్ణని అందుకే బుర్రిపాలెం బుల్లోడు అని అభిమానులు అంటారు. అయితే గుంటూరులో మహేష్ బాబు ఒక వండర్ ని క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే 50 రోజులు సినిమా ఆడితే గొప్ప విషయం.
గుంటూరు లాంటి చోట్ల ఒక సినిమా రెండు వారాలు ఆడితే గగనమే. అలాంటిది మహేష్ బాబు సినిమా మూడు థియేటర్లలో ఏకంగా 50 రోజులు ఆడింది. అదే రికార్డును కూడా క్రియేట్ చేసింది. భాస్కర్ డీలక్స్ తో పాటు సరస్వతి థియేటర్లలోనూ, టూ టౌన్ లో హాలీవుడ్ లోనూ యాభై రోజుల పాటు ఈ చిత్రం ఆడింది.
అయితే ఈ చిత్రం కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా.. రామ్ చరణ్ మగధీర సినిమా రెండు చోట్ల 50 రోజుల పాటు ఆడింది. దానిని దూకుడు సినిమా క్రాస్ చేసింది. ఏకంగా మూడు థియేటర్లలో 50 రోజుల పాటు ఈ సినిమా ఆడింది. ఇప్పటికి కూడా మహేష్ బాబు పేరుతో ఈ రికార్డు అలానే ఉండిపోయింది.
End of Article