తెలుగులో ఒకలాగా… హిందీలో ఒకలాగా…! “రాధే శ్యామ్” హిందీ వెర్షన్‌లో… మారిన 4 విషయాలు ఇవేనా..?

తెలుగులో ఒకలాగా… హిందీలో ఒకలాగా…! “రాధే శ్యామ్” హిందీ వెర్షన్‌లో… మారిన 4 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

changes in radhe shyam telugu and hindi versions

అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చర్చలో ఉన్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, సౌత్ ఇండియన్ భాషలకి, హిందీలో రిలీజ్ అయ్యే సినిమాకి మార్పులు జరగబోతున్నాయి అని తెలిసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

changes in radhe shyam telugu and hindi versions

#1 రన్ టైం విషయంలో మార్పులు ఉన్నాయి. తెలుగు సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు అయితే హిందీ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటుందట.

Unnoticed details in Radhe Shyam teaser

#2 అలాగే సౌత్ ఇండియన్ భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీలో మాత్రం మిథూన్‌ సంగీతం అందించారు.

changes in radhe shyam telugu and hindi versions

 

#3 సినిమాలో కొన్ని సీన్స్ కూడా మార్చారు అనే వార్తలు వస్తున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని సీన్స్ రూపొందించారు. అవి తెలుగు వెర్షన్‌లో ఉండే అవకాశాలు లేవు.

netizens decode radhe shyam two heartbeats poster

#4 తెలుగు సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. హిందీలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మారుతుందట. తెలుగులో ఉన్న మ్యూజిక్ హిందీలో ఉండదు. కేవలం సౌత్ ఇండియన్ భాషలకి మ్యూజిక్ అందించడానికి మాత్రమే తమన్ ని తీసుకున్నట్లు సమాచారం.

changes in radhe shyam telugu and hindi versions

అలా తెలుగు, హిందీ భాషల్లో పోల్చి చూస్తే రాధే శ్యామ్ సినిమాకి చాలా మార్పులు చేశారు.


End of Article

You may also like