Ads
ఎక్కువ మంది సీరియల్స్ ని చూస్తూ ఉంటారు. సీరియల్ టైం లో కరెంట్ పోతేనే చాలా మంది ఆడవాళ్ళు ఏదో కోల్పోయినట్లే ఉంటారు. పైగా క్రికెట్ మ్యాచ్లు కానీ ఏదైనా మంచి సినిమా వచ్చినా సరే ఛానల్ మార్చరు. అలానే సీరియల్ ని షూట్ చెయ్యాలంటే కూడ చాలా ఖర్చు అవుతుంది. పైగా డబ్బులుంటే సరిపోదు ఎంతో శ్రమ పడాలి కూడ.
Video Advertisement
పెద్ద పెద్ద ఇల్లు, కార్లు అలానే నటీ నటులు కి కాస్ట్యూమ్స్ ఇలా సీరియల్ తీయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది. అయితే సీరియల్స్ లో కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
మహిళలకు ఎక్కువగా మంచి కాస్ట్యూమ్స్ ని ఇస్తూ ఉంటారు. అందంగా కనపడటానికి ధర ఎక్కువ ఉండే చీరలను, నగలను వేస్తూ ఉంటారు. అలానే మేకప్, హెయిర్ స్టైల్ ఇలాంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే నిజానికి ఎక్కువ ధర వుండే చీరల్ని సినిమాల్లో వాడుతూ ఉంటారు కదా.. మరి అంత కాస్ట్లీ చీరలని సీరియల్ యాక్టర్స్ వేసుకున్నాక ఏం చేస్తారు..?
వాటిని పారేస్తారా అప్పుడు డబ్బులు వేస్ట్ కదా.. ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే నిజానికి కొన్ని కొన్ని సార్లు సీరియల్స్ లో నటించే నటీ నటులు వాళ్ళ సొంత కాస్ట్యూమ్ తోనే షూటింగ్ పూర్తి చేస్తారు. ఎక్కువ శాతం ప్రొడక్షన్ వాళ్ళు చీరలు మరియు ఇతర కాస్ట్యూమ్స్ ని వాళ్ళకి అందిస్తారు.
పైగా సీరియల్స్ ఎక్కువ కాలం పాటు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికీ అనుమానం లేకుండా నెలకొక సారి చీరల్ని మార్చి మర్చి ఆడతారు. దీంతో సీరియల్ చూసే వాళ్ళు కూడా చీరల్ని గుర్తుపట్టలేరు. అలానే ఆ కాస్ట్యూమ్స్ కూడ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి.
End of Article